తొమ్మిది రోజుల పాటు చేసే బతుకమ్మలను ఏమని పిలుస్తారో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.

తెలంగాణ ఆడపడుచులంతా అందంగా ముస్తాబై రంగురంగు పూలతో బతుకమ్మలను తయారు చేస్తారు.

అంతేనా వాటి చుట్టూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడతారు.విన సొంపైన పురాణ గాథలను పాటల రూపంలో పాడుతూ.

Do You Know What The Nine Days Of Bathukamma Are Called , Bathukamma, Bathukamm

చరిత్రను నేటి తరానికి చెబుతుంటారు.అయితే తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మలను రోజుకో విధంగా పిలుచుకుంటారు.

వాటి పేర్లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు.

Advertisement

మహా అమావాస్య రోజు ఈ బతుకమ్మను మొదటి రోజు తయారు చేస్తారు.రెండో రోజు చేసే బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమని నాడు దీన్ని తయారు చేస్తారు.మూడో రోజు చేసే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు.

నాలుగో రోజు బతుకమ్మను నానే బియ్యం బతుకమ్మ అంటారు.ఐదో రోజు చేసే బతుకమ్మను అట్ల బతుకమ్మగా పిలుచుకుంటారు.

ఆరో రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అంటారు.ఆశ్వయుజ పంచమి నాడు ఈ బతుకమ్మను చేస్తారు.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..

ఏడో రోజు చేసే బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అంటారు.ఎనిమిదో రోజు చేసే బతుకమ్మను వెన్న ముద్దల బతుకుమ్మ అని పిలుస్తారు.

Advertisement

తొమ్మదో రోజు చేసే బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు.ఇదే చివరి బతుకమ్మ.

అశ్వయుజ అష్టమి నాడు ఈ చివరి బతుకమ్మను చేస్కుంటారు.

తాజా వార్తలు