ప్రభాస్ ఆ సబ్జెక్టులో అంత వీకా... ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉండేవారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సెలబ్రిటీలందరూ కూడా పెద్దగా చదువుకోలేదని చెప్పాలి.కొంతమంది మాత్రమే మాస్టర్స్, బీటెక్ పూర్తి చేయగా మరికొందరు టెన్త్ ఇంటర్ తో చదువు మానేసి నటనలో శిక్షణ తీసుకుంటూ నటన వైపు అడుగులు వేశారు.

 Do You Know What Prabhas Studied So Much In That Subsection , Prabhas, Tollywood-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ సెలబ్రిటీ లందరూ కూడా ఎక్కువగా చదువులు చదువుకోలేదని చెప్పాలి ఇలా ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్నటువంటి వారిలో ప్రభాస్ ఒకరు.ఈయన కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేశారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ( Prabhas ) అనంతరం రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి ( Bahubali ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో అప్పటినుంచి ప్రభాస్ తన సినిమాలన్నింటినీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉన్నారు.

Telugu Prabhas Studied, Prabhas, Tollywood-Movie

ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఒక్కో సినిమాకు సుమారు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకు ఉన్నటువంటి ప్రభాస్ కి చదువు అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదని తెలుస్తుంది.ఈయన ఒక సబ్జెక్టులో చాలా వీక్ అవ్వడంతో తరచూ ఆ సబ్జెక్టు ఫెయిల్ అవుతూ ఉండేవారట.దాంతో చదువు అంటేనే చాలా చిరాకు వచ్చేదని అందుకే చదువు పూర్తి చేయకుండా నటన వైపు అడుగులు వేస్తూ నటనలో శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారని తెలుస్తుంది.

Telugu Prabhas Studied, Prabhas, Tollywood-Movie

ముఖ్యంగా ప్రభాస్ కి మాథ్స్( Maths ) సబ్జెక్ట్ అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదట తనకు ఎంత ప్రయత్నం చేసిన మ్యాథ్స్ అర్థం కావని, ప్రతిసారి మాథ్స్ సబ్జెక్టులో ఫెయిల్ అవుతూ ఉండడంతో తన తల్లితండ్రులు ఏకంగా తనకు ప్రత్యేకంగా ఒక టీచర్ ను నియమించి ట్యూషన్ కూడా చెప్పించేవారని తెలుస్తుంది.ఇలా ట్యూషన్ చెప్పించుకున్నప్పటికీ కూడా ఈయన పలు సందర్భాలలో లెక్కలలో ఫెయిల్ అయ్యారని అందుకే చదువుకు పులిస్టాప్ పెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది.

ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయనకు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు.

ఇక తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతున్న స్టార్ హీరోగా మారిపోయారు.ఎంత స్టార్ హీరో అయినా ఎంత ఎత్తుకు ఎదిగిన ఎంతో ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్ ది అంటూ ఇప్పటివరకు తనతో కలిసి పని చేసినటువంటి సెలబ్రిటీలు ప్రభాస్ వ్యక్తిత్వం పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube