చ‌లికాలంలో రోజూ నెయ్యి తింటే ఏం అవుతుందో తెలుసా?

చ‌లి కాలం రానే వ‌చ్చింది.రోజురోజుకు చ‌లి పులి బ‌లంగా మారుతోంది.

ఈ సీజ‌న్‌లో అనారోగ్య సమస్యల‌తో పాటు చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు సైతం కాస్త ఎక్కువ‌గానే ఇబ్బంది పెడుతుంటాయి.

వీట‌న్నింటి నుంచీ త‌ప్పించుకోవాలంటే ఖ‌చ్చితంగా డైలీ డైట్‌లో కొన్ని కొన్ని ఆహారాల‌ను చేర్చుకోవాలి.

అటు వంటి ఆహారాల్లో నెయ్యి ఒక‌టి.అవును, చ‌లి కాలంలో నెయ్యిని ప్ర‌తి రోజు తినాల‌ని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రి ఎందుకు చ‌లికాలంలో రోజూ నెయ్యి తినాలి.? అస‌లు ఈ సీజ‌న్‌లో నెయ్యి తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు ఏంటీ.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Eat Ghee, Ghee, Winter, Benefits Of Ghee, Latest News, Health Tips, Good Health
Advertisement
Eat Ghee, Ghee, Winter, Benefits Of Ghee, Latest News, Health Tips, Good Health

సాధార‌ణంగా కొంద‌రిలో చ‌లి త‌ట్టుకునే సామ‌ర్థ్యం చాలా త‌క్కువ‌గా ఉంటుంది.అలాంటి వారు ఈ సీజ‌న్‌లో ఎంతో ఇబ్బంది ప‌డి పోతుంటారు.అయితే ప్ర‌తి రోజు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి క‌లిపి తీసుకుంటే గనుక‌.

అందులోని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు శ‌రీరంలో వేడిని పెంచి చలి తీవ్రతను తట్టుకోగ‌లిగే శ‌క్తిని అందిస్తుంది.అలాగే ఈ చ‌లి కాలంలో దాదాపు అంద‌రి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌లు స‌హ‌జంగానే బ‌లహీన పడిపోతాయి.

ఫ‌లితంగా అనేక ర‌కాల వైర‌స్‌లు, ఇన్ఫెక్ష‌న్లు చుట్టు ముట్టేస్తాయి.అయితే రోజూ నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ సిస్ట‌మ్ స్ట్రోంగ్‌గా మారుతుంది.

త‌ద్వారా సీజ‌నల్ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అదే స‌మ‌యంలో శ్వాసకోశ సమస్యల నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Eat Ghee, Ghee, Winter, Benefits Of Ghee, Latest News, Health Tips, Good Health
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇక చ‌లి కాలంలో చాలా మంది జీర్ణ స‌మ‌స్య‌ల‌తో తెగ స‌త‌మ‌త‌మైపోతుంటారు.అయితే ప్ర‌తి రోజూ గ్లాస్ గోరు వెచ్చ‌టి పాల‌లో కొద్దిగా నెయ్యిని క‌లిపి సేవించాలి.త‌ద్వారా జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారి.

Advertisement

గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

తాజా వార్తలు