చంటి పిల్ల‌ల‌కు కొబ్బ‌రి నీళ్లు ప‌టిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

కొబ్బ‌రి నీళ్లు రుచిగా ఉండ‌ట‌మే కాదు బోలెడ‌న్ని పోష‌క విలువ‌ల‌నూ క‌లిగి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా కొబ్బ‌రి నీళ్లు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అయితే కొంద‌రు చంటి పిల్ల‌ల‌కూ కొబ్బ‌రి నీళ్లు ప‌ట్టిస్తుంటారు.మ‌రికొంద‌రు మాత్రం చిన్న పిల్ల‌ల‌కు కొబ్బ‌రి నీళ్లు ప‌ట్టిస్తే జ‌లుబు చేస్తుంద‌ని అంటుంటారు.అస‌లు చంటి పిల్ల‌ల‌కు కొబ్బ‌రి నీళ్లు ప‌ట్టించ‌వ‌చ్చా.? వాళ్ల‌కు కొబ్బ‌రి నీళ్లు మంచివేనా.? కాదా.? అన్న సందేహాలకు ఇప్పుడు స‌మాధానాలు తెలుసుకుందాం.ఆరు నెల‌లు నిండిన‌ చంటి పిల్ల‌ల‌కు ఎటువంటి భ‌యం లేకుండా కొబ్బ‌రి నీళ్లు ఇవ్వొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే ఎక్కువ మోతాదులో కాకుండా ఒక‌టి, రెండు స్పూన్ల చొప్పున ఫ్రెష్ కొబ్బ‌రి నీళ్ల‌నే ప‌ట్టించాలి.త‌ద్వారా పిల్ల‌ల‌కు బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.ముఖ్యంగా చంటి పిల్ల‌ల‌కు అప్పుడ‌ప్పుడు కొబ్బ‌రి నీళ్లు ప‌టిస్తే.

జలుబు, ఫ్లూ వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Do You Know What Happens If Coconut Water Is Given To Months Childrenmonths Chi
Advertisement
Do You Know What Happens If Coconut Water Is Given To Months Children?months Chi

అలాగే చంటి పిల్ల‌ల్లో అధికంగా క‌నిపించే స‌మ‌స్య మ‌ల‌బ‌ద్ధ‌కం.అయితే రోజుకు ఒక‌టి లేదా రెండు స్పూన్ల చ‌ప్పున కొబ్బ‌రి నీళ్లు తాగిస్తే.చంటి పిల్ల‌ల్లో జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మార‌తుంది.

ఫ‌లితంగా మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి, గ్యాస్, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌ల్లో పిల్ల‌ల్లో ఏర్ప‌కుండా ఉంటాయి.అంతే కాదు, ఆరు నెల‌లు నిండిన పిల్ల‌ల‌కు కొబ్బ‌రి నీళ్లు ప‌ట్టిస్తే.

వారిలో మూత్ర మార్గము అంటు వ్యాధులు ఏమైనా ఉంటే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.క‌డుపులో పురుగులు ఉంటే నాశ‌నం అవుతాయి.

మ‌రియు పిల్ల‌ల్లో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య కూడా ఏర్ప‌డ‌కుండా.అయితే చ‌లి కాలంలో మాత్రం పిల్ల‌ల‌కు కొబ్బ‌రి నీళ్లు ఇవ్వ‌క‌పోవ‌డం మంచిది.

పోషకాల ఘనీ : బ్లూ బెర్రీస్

మ‌రియు కొబ్బ‌రి నీళ్ల వ‌ల్ల పిల్ల‌ల్లో అలెర్జీ ఏర్ప‌డినా.వారికి తాగించ‌కూడ‌దు.

Advertisement

తాజా వార్తలు