క్రిస్మస్ రోజు రాత్రి క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా?

సంవత్సరంలో ప్రతి నెల ఎన్నో పండుగలు మనకు ఆనందాన్ని ఇస్తాయి.

అన్ని పండుగలు ఒకెత్తయితే క్రైస్తవులకు మాత్రం సంవత్సరానికి ఒకసారి వచ్చే అతి పెద్ద పండుగలలో క్రిస్మస్ ఒకటని చెప్పవచ్చు.

సంవత్సరం చివరలో వచ్చే ఈ పండుగను క్రైస్తవులందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు.డిసెంబర్ 25న యేసు క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా ఈ పండుగను కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు.

కానీ క్రిస్మస్ కన్నా, క్రిస్మస్ ముందు రోజు రాత్రి క్రైస్తవులు పెద్ద ఎత్తున చర్చికి వెళ్లి వేడుకలను జరుపుకుంటారు.అయితే ఆ రోజు రాత్రి క్రిస్మస్ వేడుకలను ఏ విధంగా జరుపుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం.

క్రైస్తవులు క్రిస్మస్ కంటే క్రిస్మస్ ముందు రోజు రాత్రిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ముందురోజు రాత్రి కుటుంబసభ్యులందరూ కలిసి చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు.

Advertisement
Do You Know What Christians Do On Christmas Night, Christians, Christmas, Partic

ప్రార్థనలు ముగించిన అనంతరం యేసుప్రభు జననం గురించి కథలను వింటారు.అన్నిటికంటే ముఖ్యంగా క్రిస్మస్ గీతాలను ఆలపిస్తూ, చిన్నారులు డాన్సులను చేస్తూ ఎంతో సందడిగా ఈ పండుగను ముందురోజు రాత్రే నిర్వహించుకుంటారు.

Do You Know What Christians Do On Christmas Night, Christians, Christmas, Partic

క్రిస్మస్ రోజు క్రైస్తవులు అందరూ పెద్ద ఎత్తున బహుమతులను వారి పిల్లలకు, బంధువులకు, సన్నిహితులకు పంపిస్తూ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తుంటారు.అంతేకాకుండా ఈ క్రిస్మస్ వేడుకలలో కేకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.ఈ క్రిస్మస్ కానుకగా ఇంట్లోనే కేకులు తయారు చేసి తమ బంధువులకు పంపిస్తుంటారు.

ఈ క్రిస్మస్ కానుకగా శాంటా క్లాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.శాంటా క్లాస్ వచ్చి పిల్లలకు చాక్లెట్లు, బహుమతులను ఇవ్వడం ఒక సాంప్రదాయంగా ఉంటుంది.

క్రిస్మస్ ముందు నుంచి క్రైస్తవులు తమ ఇళ్లలో క్రిస్మస్ ట్రీ లను విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరిస్తారు.ఈ విధంగా క్రిస్మస్ కంటే ముందు రోజు రాత్రి ఎంతో ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!
Advertisement

తాజా వార్తలు