ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు ఒకప్పుడు విపరీతమైన కష్టాన్ని అనుభవించి మెల్లిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు వస్తుంటారు.అందులో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు.
ఇక మొత్తానికైతే సినిమాల్లో తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు.అయితే ఇక్కడ అందరూ సక్సెస్ అవుతారనే గ్యారంటీ లేదు.
కొంతమంది సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకుంటుంటే మరి కొంత మంది మాత్రం ఫ్లాపుల్లో ఉండి అసలు అవకాశాలు కూడా లేకుండా ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోతూ ఉంటారు.అందుకే ఇండస్ట్రీలో ఎవరూ ఎన్ని రోజులు ఉంటారో ఎవరు చెప్పలేరు…ఇక ఇదిలా ఉంటే తేజ( Teja ) డైరెక్షన్ లో నితిన్( Nithin ) హీరోగా వచ్చిన జయం సినిమా( Jayam Movie ) మంచి విజయాన్ని దక్కించుకుంది.అయితే తేజ నువ్వు నేను సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత జయం సినిమా స్టోరీ రాసుకున్నారు.అయితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ను( Uday Kiran ) హీరోగా పెట్టి తీద్దామని అనుకున్నారట.
కానీ అప్పటికే వరుసగా రెండు సినిమాలు ఉదయ్ కిరణ్ తో చేయడం దానికి తోడు ఆయనతోనే కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం కరెక్ట్ కాదు అని అనుకున్న తేజ అప్పటికే నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న సుధాకర్ రెడ్డి గారి కొడుకు అయిన నితిన్ ని చూశాడట.ఇక అప్పుడే తేజ జయం సినిమాలో నితిన్ ను హీరోగా పెట్టి చేయాలని అనుకున్నారు.ఇక తను అనుకున్నట్టుగానే నితిన్ ను హీరోగా పెట్టి ఈ సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకున్నారు.మొదటగా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ తీసుకుందాం అనుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు…
.