సమాజంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి.ముఖ్యంగా భారతదేశంలో బంధాలు బంధుత్వాలు వాటి విలువలు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
సమాజంలో ఉన్న మనిషి అరణ్యంలో ఉన్న మృగాని కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు.దేశంలో రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.
వావి వరసలు లేకుండా మనిషి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు.సొంత తోబొట్టులపైనే అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
ఇటువంటి ఘటనలు దేశంలో ఇటీవల పెరిగిపోతూ ఉన్నాయి.అక్రమ సంబంధాలు( Illegal Affairs ) కేసులు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి.
డబ్బు కోసం… పడక సుఖం కోసం మరింత హీనంగా ప్రవర్తిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో( Uttar Pradesh ) ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.ఏకంగా ఓ వివాహిత సొంత సోదరుడిని( Brother ) పెళ్లాడింది.ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సామూహిక వివాహాలు( Mass Weddings ) చేసుకునే వారికి 35వేల రూపాయలు అందిస్తోంది.
ఇందుకోసం ఓ మహిళ ఏకంగా తన సోదరుడినే దొంగ పెళ్లి చేసుకుంది.పెళ్లి సమయానికి వరుడుని తెచ్చుకోకపోవడంతో మధ్యవర్తులు ఆమె సోదరుడిని రెడీ చేశారు.ఆమె మెడలో తాళి కట్టించారు.ఆమెకు అప్పటికే పెళ్లి కావడం గమనార్హం.
ఈ విషయం వెలుగులోకి రావడంతో మహారాజ్ గంజ్ అధికారులు షాక్ అయ్యారు.ఈ రకంగా డబ్బు కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సామూహిక వివాహాల పేరిట.
ఆడవాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారు.