కేసీఆర్.. ద‌ళిత ముఖ్య‌మంత్రిని చేస్తాన‌న్న‌ది ఎవ‌రనో తెలుసా... ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే..!

తెలంగాణ ఉద్య‌మం మంచి కాక‌మీదున్న రోజుల‌వి! భారీ ఎత్తున టీఆర్ ఎస్ వ‌ర్గాలు.ప్ర‌జ‌ల‌ను కూడ‌గ‌డుతున్న ప‌రిస్థితి క‌నిపించిన రోజులు అవి! రోజూ ఉద్య‌మ‌మే.

 Do You Know This Story About Kcr,telangana,chief Minister,kcr,dalits,cm,hot Poli-TeluguStop.com

ఎక్క‌డ చూసినా.ప్ర‌త్యేక తెలంగాణ వాద‌మే.

అయిన‌ప్ప‌టికీ.బ‌ల‌మైన కాంగ్రెస్ లాబీయింగ్ ముందు.

రాష్ట్రం వ‌స్తుందో రాదో.అనే సందేహం.

టీఆర్ ఎస్ అధినేత‌.కేసీఆర్‌కు మ‌న‌సులో గుబులుగా మారింది.

ఈ క్ర‌మంలో ముఖ్యంగా రాజ‌కీయ వ్యూహాన్ని ప‌క్క‌న పెట్టిన ఆయ‌న ప్ర‌జ‌ల‌ను స‌మైక్య ప‌రిచేందుకు మ‌రో వ్యూహాన్ని తెర‌మీద‌కి తెచ్చారు.అదే.తెలంగాణ వ‌స్తే.ద‌ళిత నేత‌ను ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని చేస్తాన‌ని పెద్ద ఎత్తున ప్ర‌క‌టించారు.

దీంతో అంద‌రూ ఫిదా అయ్యారు.

ఈ క్ర‌మంలోనే అంద‌రూ క‌లిసి వ‌చ్చారు.

ఉద్య‌మం తార‌స్తాయికి చేరింది.చివ‌ర‌కు కాంగ్రెస్ అంగీకారంతో .తెలంగాణ వ‌చ్చేసింది.అయితే.

కేసీఆర్ ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్నారా? అంటే.ఇప్ప‌టికీ లేద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

కానీ.అస‌లు కేసీఆర్ ఒక‌వేళ ద‌ళిత నేత‌ను ముఖ్య‌మంత్రిని చేసి ఉంటే.

ఎవ‌రు ముఖ్య‌మంత్రి అయి ఉండేవారు?  ఏ నేత‌ను ఆయ‌న దృష్టిలో పెట్టుకుని ఈ ప్ర‌క‌ట‌న చేశారు? అనే ప్ర‌శ్న‌లకు ఇప్ప‌టికీ చాలా మందికి స‌మాధానం తెలియదు.కానీ.

కేసీఆర్ వ్యూహం ప్ర‌కారం .ద‌ళిత నేత‌ను ముఖ్య‌మంత్రిని చేసి ఉంటే.వికారాబాద్ అసెంబ్లీ నియోక‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డును సొంతం చేసుకున్న డాక్ట‌ర్ ఏ.చంద్ర‌శేఖ‌ర్ ఆ పీఠాన్ని అధిరోహించేవార‌న్న ప్ర‌చారం అప్ప‌ట్లో న‌డిచింది.

కానీ, కేసీఆర్ యూట‌ర్న్ తీసుకున్న కార‌ణంగా.సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌జానేత‌, ద‌ళిత వ‌ర్గాల ఆశాజ్యోతి డాక్ట‌ర్ ఏ.చంద్ర‌శేఖ‌ర్ సీఎం కాలేక పోయారు.వాస్త‌వానికి కేసీఆర్ దృష్టిలోనూ చంద్ర‌శేఖ‌ర్ ఉన్నారు.

ఆయ‌న‌ను దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ ద‌ళిత సీఎం ప్ర‌క‌ట‌న చేశారు.కానీ, రాష్ట్రం సిద్ధించిన త‌ర్వాత‌.

అధికార పిపాస‌తో.కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు.

ఇక‌, చంద్ర‌శేఖ‌ర్ విష‌యానికి వ‌స్తే.ఉమ్మ‌డి రాష్ట్రంలో వికారాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1985 నుంచి టీడీపీ త‌ర‌పున వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు.

మొత్తంగా 2004 వ‌ర‌కు ఆయ‌న విజ‌యం సాధించారు.ఆ త‌ర్వాత తెలంగాణ కోసం.

టీడీపీని వ‌దులుకుని.టీఆర్ ఎస్‌లో చేరారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న టీఆర్ ఎస్‌లో నెంబ‌ర్ టూగా ఎదిగారు.అప్పుడు వైఎస్ కేబినెట్లో మంత్రిగా కూడా చేశారు.

Telugu Dalits, Harish, Hot, Latest, Politicalwar, Telangana-Telugu Political New

రాష్ట్ర సాధ‌న‌లో టీఆర్ ఎస్ అదినేత‌కు అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు.పార్టీ ఎదుగుద‌ల‌తోపాటు.రాష్ట్ర సాధ‌న‌లోనూ ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు.ఈ క్ర‌మంలోనే ద‌ళిత ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని.ఈయ‌న‌ను మ‌న‌సులో పెట్టుకునే కేసీఆర్ హామీ ఇచ్చారు.అయితే.

త‌ద‌నంతర కాలంంలో ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేశారు కేసీఆర్‌.పొమ్మ‌న‌కుండానే పొగ పెట్టేశార‌ని ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక వాపోయారు.

ఫ‌లితంగా టీఆర్ ఎస్‌కు దూర‌మైన చంద్ర‌శేఖ‌ర్‌.కొన్నాళ్లు మౌనంగానే ఉండిపోయారు.

అయితే.త‌ర్వాత సోనియా రాష్ట్రం ఇచ్చింద‌న్న కార‌ణంగా.ఆమెపై ఉన్న అభిమానంతో కాంగ్రెస్‌లో చేరారు.2019లో పెద్ద‌ప‌ల్లి పార్ల‌మెంటు స్థానం నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేశారు.అయితే.కేవ‌లం 30 వేల ఓట్ల తేడాతో ఆయ‌న ప‌రాజ‌యం పొందారు.అయిన‌ప్ప‌టికీ.ఇప్ప‌టికీ.

ఆయ‌న ప్ర‌జా నేత‌గా గుర్తింపు పొంద‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube