టాలీవుడ్ హీరో శర్వానంద్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నారు.జనవరి 26వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా వీరి నిశ్చితార్థం జరిగింది.
ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం తరలివచ్చారు.ప్రస్తుతం శర్వానంద్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షిత రెడ్డి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.
రక్షిత రెడ్డి హైకోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె మాత్రమే కాకుండా టిడిపి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు.
ఇలా రక్షిత ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉందని చెప్పాలి.

ఇలా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలోకి శర్వానంద్ అల్లుడుగా అడుగుపెట్టబోతున్నారు.ఇక మధుసూదన్ రెడ్డి న్యాయమూర్తిగా భారీగా ఆస్తుల సంపాదించారని, వీరి తాతల తరం నాటి ఆస్తిపాస్తులు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తాయని తెలుస్తోంది.

ఇక రక్షిత రెడ్డి కూడా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు.ప్రస్తుతం ఈమె హైదరాబాదులో ఉన్నప్పటికీ ఈమె పేరుపై కూడా వందల కోట్ల ఆస్తులు ఉన్నట్టు సమాచారం.ఏది ఏమైనా శర్వానంద్ కాస్త ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వందల కోట్ల ఆస్తి కలిగి ఉన్నటువంటి అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక వీరి వివాహం జనవరి 26న ఎంతో ఘనంగా జరిగింది.పెళ్లి మాత్రం వేసవిలో జరగబోతుందని సమాచారం.