ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎల్పీజీ మనదేనని మీకు తెలుసా?

దేశంలో పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్‌పీజీ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.కాగా ప్రస్తుతం దేశంలోని ప్రజలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేస్తున్నారనే సంగతి మీకు తెలుసా? అదే సమయంలో పెట్రోల్ ధరల పరంగా భారతదేశం మూడవ స్థానంలో డీజిల్ ధరల పరంగా ఎనిమిదో స్థానంలో ఉంది.భారతదేశంలో కిలో ఎల్పీజీ ధర అత్యధికం.కొనుగోలు శక్తి పరంగా, ఎపీజీ ధర కిలోకు $3.5.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల రోజువారీ ఆదాయంలో 15.6 శాతం దీనికే వెచ్చిస్తున్నారు.తలసరి రోజువారీ ఆదాయంలో ఇంత పెద్ద మొత్తం మరే దేశంలోని ప్రజలూ ఖర్చు చేయడం లేదు.

 Do You Know That The Most Expensive Lpg Details, Lpg, Most Expensive Lpg, Liquid-TeluguStop.com

అదే సమయంలో దేశంలో పెట్రోల్ ధర కూడా నిరంతరం పెరుగుతోంది.ప్రతి వ్యక్తి రోజువారీ ఆదాయంలో దాదాపు 23.5 శాతం లీటరు పెట్రోలు కొనుగోలుకే వెచ్చిస్తున్న పరిస్థితి ఏర్పడింది.పొరుగు దేశాలైప నేపాల్, పాకిస్తాన్ భారతదేశం కంటే ముందున్నాయి.నేపాల్‌లోని వారి రోజువారీ సంపాదనలో 38.2 శాతం పెట్రోల్‌పై ఖర్చు అవుతుండగా, పాకిస్తాన్‌లో 23.8 శాతం పెట్రోల్ కొనుగోలు కోసం ఖర్చు చేస్తున్నారు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలసరి రోజువారీ ఆదాయంతో పోల్చితే పెట్రోల్-డీజిల్, వంటగ్యాస్‌పై చాలా తక్కువ నిష్పత్తిలో ఖర్చు చేస్తున్నారు.

Telugu Gas, Diesel, Domesticgas, India Currency, Liquidpetroleum, Expensive Lpg,

యూఎస్‌లో, రోజువారీ ఆదాయంలో 0.6 శాతం పెట్రోల్‌పై, 0.7 శాతం డీజిల్‌పై ఖర్చు చేస్తున్నారు.అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ స్థానం, ఇతర దేశాలలో విక్రయించే పెట్రోల్, డీజిల్ కరెన్సీ ప్రకారం దాని ధరలను లెక్కించారు.అటువంటి పరిస్థితిలో, భారతదేశంలో లీటరు ఎల్పీజీ ధర $ 3.5గా ఉంది.ఇది ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికం.భారతదేశం తర్వాత టర్కీ, ఫిజీ, ఉక్రెయిన్ ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube