న్యాచురల్ స్టార్ నాని ( Nani )సినిమాల్లో హీరో కాకముందే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారనే సంగతి చాలా మందికి తెలియదు.అయితే ఆయన ఇప్పటికే ఆయనకు సంబంధించిన కొన్ని సినిమా ఈవెంట్లలో లేదా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టారు.
ఇక నాని అప్పటి స్టార్ డైరెక్టర్ లైన రాఘవేందర్రావు, మణిరత్నం,కృష్ణవంశీ వంటి వారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా రోజులు చేశారట.ఇక డైరెక్టర్ అవుదామనుకున్న నాని ఉన్నట్టుండి అష్టా చమ్మా ( Ashta Chamma )అనే మూవీతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.
అయితే అలాంటి నానికి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటంటే నాని కేవలం సినిమాలకే కాదు బుల్లితెర మీద బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఒక సీరియల్ కి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.మరి ఇంతకీ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఆ పాపులర్ సీరియల్ ఏంటి అనేది చూస్తే.అప్పట్లో చాలా సీరియల్స్ వచ్చేవి.
కానీ వాటన్నింటిలో అమృతం సీరియల్ ఎవర్ గ్రీన్.ఈ సీరియల్ ఎన్ని ఎపిసోడ్లు చూసినా కూడా అస్సలు బోర్ కొట్టదు.
చాలామంది మైండ్ రిఫ్రెష్ చేసుకోవడం కోసం, కడుపుబ్బా నవ్వడం కోసం అమృతం సీరియల్( Amritham serial ) ని చూసేవారు.

ఈ సీరియల్లో పాత్రలు, వాళ్ళు చేసే ఫన్ చూడడానికి చాలామంది జనాలు ఆసక్తిగా ఎదురు చూసేవారు.అలా ఈ సీరియల్ ని ఇప్పుడు మళ్లీ టెలికాస్ట్ చేసిన కూడా చూడడానికి చాలామంది జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.అయితే అలాంటి ఈ సీరియల్ కి డైరెక్టర్ గా చేసిన గోపి కసిరెడ్డి( Gopi Kasireddy ) దగ్గర నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారట.
అయితే ఈ సీరియల్ చేసే సమయంలో నాని దాదాపు పది ఎపిసోడ్ లకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారట.అయితే ఈ విషయం చాలామందికి తెలియదు.