సీఎం కేసీఆర్ ( C.M.KCR ) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన ఉద్యమ ధీరుడు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి, రాజకీయ పదవులను కూడా వదులుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాడు.
కేవలం తెలంగాణలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని టిఆర్ఎస్ గా ఉన్న పార్టీని బిఆర్ఎస్ ( BRS ) గా మార్చారు.ఇప్పటికే తెలంగాణలో రెండు పర్యాయాలు గద్దెనెక్కిన కేసీఆర్ ప్రభుత్వం, మూడోసారి కూడా గద్దెనెక్కి రికార్డులు క్రియేట్ చేయాలని చేత విధాలా ట్రై చేస్తున్నాడు.అలాంటి కెసిఆర్ ఎప్పుడు గెలవడమే కానీ ఓడిపోవడం అనేది తెలియదని చాలామంది అనుకుంటారు.
కానీ కెసిఆర్ కూడా ఒకసారి ఓటమిపాలయ్యారట.
ఆ వివరాలు ఏంటో చూద్దాం.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి.
అందులో సిద్దిపేట ( Siddipeta ) నియోజకవర్గం కూడా భాగం.అది 1983 సమయం అన్ని నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి.
ఇదే తరుణంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సిద్ధిపేటలో ఎలక్షన్స్ జోరు మొదలైంది.
ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు( NT.Ramarao ) తెలుగుదేశం పార్టీ నుంచి సిద్దిపేటలో ఒక అభ్యర్థిని నిలబెట్టారు.ఆ అభ్యర్థి ఎవరో కాదు మన కల్వకుంట్ల తారక రామారావు.అయితే సిద్దిపేటలో అప్పటికే మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతుల మదన్ మోహన్ రెడ్డి కి పోటీగా కెసిఆర్ టిడిపి నుంచి పోటీ చేశారు.
అయితే మదన్ మోహన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని లీడర్.అప్పటికే సిద్దిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే.దీంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి టికెట్ ఆయనకే కేటాయించింది.ఈ క్రమంలోనే సిద్దిపేట నియోజకవర్గంలో మొదటిసారి పోటీ చేసినటువంటి కేసీఆర్ మదన్ మోహన్ రెడ్డి ( Madan mohan reddy ) మీద కేవలం 877 ఓట్లతోనే ఓడిపోయారు.
తన జీవితంలో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత 13 సార్లు ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు తప్ప ఎక్కడ ఓడిపోలేదు.