బాలనాగమ్మగా శ్రీదేవి నటించిన ఈ సినిమా గురించి మీకు తెలుసా

శ్రీదేవి.ఈ పేరు వినగానే మన ముందుతరం వారికి ఏదో తెలియని అనుభూతి.

ఆమె పేరు వినబడితే చాలు వెంటనే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో అతిలోకసుందరి క్యారెక్టర్ గుర్తొస్తుంది.ఈ క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకుల మనసులో అంతగా చిరస్థాయిగా నిలిచిపోయింది.

వయస్సు మీద పడిన కొద్దీ తన కూతుర్లతో సమానంగా బాడీని, గ్లామర్‌ను మెయింటేన్ చేసింది ఈ ఎవగ్రీన్ క్వీన్.జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం వంటి సినిమాల్లో అమాయకపు అమ్మాయి పాత్రల్లో నటించి, జీవించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

చాలా రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రీదేవి.ఇంగ్లీష్, వింగ్లీష్ అనే సినిమాలో మెయిన్ క్యారెక్టర్‌లో నటించి మరో సారి తన నటనను ప్రూవ్ చేసుకుంది.

Do You Know Sridevi Acted As Balanagamma ,sridevi, Balanagamma, Jagadeka Veeru A
Advertisement
Do You Know Sridevi Acted As Balanagamma ,Sridevi, Balanagamma, Jagadeka Veeru A

ఇక అసలు విషయానికి వస్తే.‘బాలనాగమ్మ’ 1970-80లో ఈ నాటకం చాలా ఫేమస్.సినిమా రూపంలో వచ్చిన నాటకాలలో ‘బాలనాగమ్మ’ సైతం ఒకటి.

ఈ నాటకాన్ని ఎన్నో నాటక పరిషత్‌లు, సమాజాలు.దేశం నలుప్రాంతాల్లో ప్రదర్శించి దానిని పాపులర్‌గా మార్చాయి.

ఇంతటి ప్రజాదరణ పొందిన బాలనాగమ్మ.సినిమాగా ఐదు సార్లు రూపుదిద్దుకున్నది.

ఈ ఐదు సినిమాల్లో టైటిల్ పాత్రల్లో శ్రీదేవి, జమున, మిస్ చెలం, కాంచనమాల, అంజలీదేవి నటించారు.ఇంత మంది టైటిల్ రోల్ పోషించినా.బాలనాగమ్మ అంటే కాంచనమాలే అందరికీ గుర్తొస్తుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఇక బాలనాగమ్మ పాత్రలో జమున యాక్ట్ చేసి సినిమా విడుదల కాలేదు.శ్రీదేవి సైతం బాలనాగమ్మగా నటించిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

Advertisement

ఈ సినిమాను మొదట తమిళ, తెలుగు భాషా చిత్రంగా స్టార్ట్ చేసినా.చివరకు కేవలం తమిళ భాషలో మాత్రమే నిర్మించారు.

దానికి కారణాలు ఏవైనా తెలుగు వర్షంలో మాత్రం నిర్మించలేదు.అనంతరం ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి 1982లో ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ చివరకు ఏప్రిల్ 30న విడుదల చేశారు.

అప్పటికే శ్రీదేవి అగ్రనాయికగా కొనసాగుతున్నది.ఈ సమయంలో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.

ఇందులో శరత్ బాబు, సుదర్శన్, మంజుభార్గవి తదితరులు కీలక పాత్రల్లో నటించడం విశేషం.

తాజా వార్తలు