సోనుసూద్ గ్యారేజ్‌లో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయో తెలుసా?

సోనుసూద్. కరోనా కష్టకాలంలో ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది.

కరోనా కారణంగా కాలిన నడకన సొంత ప్రదేశాలకు వెళ్లే కార్మికులను.

బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపడంతో మొదలైన ఆయన సేవా కార్యక్రమాలు ప్రస్తుతం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగుతున్నాయి.

ఆక్సీజన్ కొరత తీర్చడంతో పాటు ఎందరికో ప్రాణదాతగా మారాడు ఈ నటుడు.రీల్ జీవితంలో విలన్ గా నటించే సోనుసూద్.

రియల్ లైఫ్ లో మాత్రం నిజమైన హీరోగా మారాడు.తాజాగా ఆయన తన కొడుక్కి ఓ ఖైరీదైన కారు కొనిచ్చి వార్తల్లోకి ఎక్కాడు.

Advertisement
Do You Know Sonu Sood Luxury Cars , Sonu Sood,luxury Cars Collection, Sonu Sood

ఇంతకీ అది ఏకారో.దాని ప్రత్యేక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జూన్ 20న ఫాదర్స్ డే. ఈ సందర్భంగా తన కొడుకు ఇషాంత్ సూద్ కు లగ్జరీ కారు కొనిచ్చాడు.మెర్సిడెజ్ బెంజ్- మేబాచ్ జీఎల్ఎస్ 600 మోడల్ కారును గిఫ్టుగా ఇచ్చాడు.

ఈ కారు విలు రెండు కోట్లన్నర.తన కుమారుడి కోసం తీసుకున్న కారుకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

తన ఇంటికి వచ్చిన కారుతో కుటుంబ సభ్యులంతా కలిసి ట్రయల్ వేశారు.బ్లాక్ కలర్ లో ఉన్న ఈ కారు అద్భుతంగా అందరినీ ఆకర్షిస్తుంది.

వినీత్ తెలుగులో సత్తా చాటలేక పోవడానికి కారణం ఏంటో తెలుసా?

అటు సోను సూద్ కు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం.ఇప్పటికే తన గ్యారేజీలో చాలా లగ్జరీకార్లు చేరాయి.

Do You Know Sonu Sood Luxury Cars , Sonu Sood,luxury Cars Collection, Sonu Sood
Advertisement

ఆడీ క్యూ7, మెర్సిడెజ్ బెంజ్ ఎంఎల్ క్లాస్, పోర్చే పానామెరా సహా పలు కార్లు ఉన్నాయి.తాజాగా ఈ లిస్టులో మెర్సిడెజ్ Maybach GLS600 చేరింది.ఈ మెంజ్ కారు గత వారమే మార్కెట్ లోకి వచ్చింది.

ఈ కారుకు పలు ప్రత్యేకతలున్నాయి.కారు వెనుక భాగంలో విశాలమైన ప్రదేశం ఉంటుంది.

ముందుభాగంలో కూడా ఆరామ్ గా కూర్చోవచ్చు.కారు స్టార్ట్ అయిన 5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

అటు సోను సూద్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు.చిరంజీవితో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.హిందీలో పృథ్వీరాజ్, తమిళంలో తమిళ్ రాసన్ సినిమాలు చేస్తున్నాడు.

పలు సినిమాపై చర్చలు నడుస్తున్నాయి.

తాజా వార్తలు