Ravi Teja : రవితేజకి నచ్చిన డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ.

( Ravi Teja ) ఇండస్ట్రీకి సోలోగా ఎంట్రీ ఇచ్చిన రవితేజ చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ మారాడు.

ఆయన వరుస సినిమాలు చేస్తు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.ఇడియట్, భద్ర, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, విక్రమార్కుడు, కిక్, మిరపకాయ్ లాంటి సినిమాలతో తను స్టార్ హీరోగా మారడు.

ఇదిలా ఉంటే తనకు ఇండస్ట్రీలో నచ్చిన డైరెక్టర్ ఎవరు అనేది తను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

ముఖ్యంగా తనకు రాజమౌళి( Rajamouli ) పూరి జగన్నాథ్( Puri Jagannadh ) హరిష్ శంకర్ లు( Harish Shankar ) అంటే చాలా ఇష్టమని చెప్పాడు అలాగే వాళ్ళ మేకింగ్ కూడా తనకు చాలా బాగా నచ్చుతుందని చెప్పడం విశేషం.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా రవితేజ ఈగల్ సినిమాతో( Eagle Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా యావరేజ్ టాక్ తో మంచి వసూలను రాబట్టుంది.

Advertisement

ఇక ఇప్పుడు హరిష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా( Mr.Bachchan ) చేస్తున్నాడు.ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ సాధిస్తే రవితేజ తన కెరియర్లో మరొక బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంటాడు అని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

ఇక వీటితోపాటుగా మరికొన్ని సినిమాలను కూడా తను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే కొంతమంది యంగ్ డైరెక్టర్లకి కూడా తను అవకాశం ఇవ్వబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఆగిపోయిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా మళ్లీ తిరిగి స్టార్ట్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా అయితే మళ్లీ రవితేజతో చేసే ప్రయత్నాలు అయితే జరగడం లేదు.కానీ మరో కొత్త కథతో గోపీచంద్ మలినేని మరోసారి రవితేజతో సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు