హీరో కార్తికేయ ( Hero Karthikeya ) అనే పేరు కంటే ఆర్ఎక్స్ 100 హీరో అంటేనే ఎక్కువ మంది గుర్తుపడతారు.కార్తికేయ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.
ఇక ఈ సినిమా కంటే ముందే ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో వచ్చినప్పటికీ ఈ సినిమా అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు.ఆ తర్వాత వచ్చిన ఆర్ఎక్స్ 100 ( RX100) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కార్తికేయకి మంచి ఇమేజ్ క్రియేట్ చేసింది.
ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఈయన నటించిన ఏ సినిమా కూడా అంతగా హిట్ అవ్వలేదు.ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన బెదురులంక 2012 ( Bedurulanka 2012 ) ఓ మోస్తారు హిట్ అయింది.
ఇక ఈయన నటించిన గుణ 369, రాజా విక్రమార్క,చావు కబురు చల్లగా, 90 ML, హిప్పీ వంటి సినిమాలు అంతగా హిట్ అవ్వలేదు.అలాగే వలిమై ( Valimai ) సినిమాలో ఈయన విలన్ గా కూడా చేశారు.
అయితే కార్తికేయ తాజాగా తన రెండో పెళ్లి రోజుని గ్రాండ్ గా జరుపుకున్నారు.ఇక ఆయన మ్యారేజ్ డే సందర్భంగా ఆయన ప్రేమ పెళ్లి ఎలా జరిగింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తికేయ వరంగల్ నిట్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు.ఇక ఆ కాలేజ్ లో చదువుతున్న సమయంలోనే లోహిత రెడ్డి ( Lohitha reddy ) అనే అమ్మాయితో ప్రేమలో పడ్డారట.2010లో వీరి మధ్య ప్రేమ పుడితే 2021 వరకు వీరి ప్రేమ అలాగే కొనసాగింది.అంటే దాదాపు పది సంవత్సరాలు వీరు ప్రేమలో మునిగి తేలారు.

అలా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా తానేంటో రుజువు చేసుకున్నాక ఇరు కుటుంబ సభ్యులను తమ ప్రేమ విషయంలో ఒప్పించి 2021 నవంబర్ 25న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి మధ్య పదేళ్లు ప్రేమాయణం సాగింది అంటే మామూలు విషయం కాదు.ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండే చాలా మంది కనీసం ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా ప్రేమించుకోలేరు.చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా విడిపోతూ ఉంటారు.

అయితే అలాంటిది కార్తికేయ ( Karthikeya ) ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నా కూడా తాను ప్రేమించిన అమ్మాయిని మాత్రం మర్చిపోలేదు.అలా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి పెళ్లికి టాలీవుడ్ నుండి ఎంతోమంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.అయితే తాజాగా తమ రెండో పెళ్లి రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న ఈ జంట తమ కి సంబంధించి ఒక రేర్ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.