విరాట్ కోహ్లీ ఏ వ్యాపార సంస్థలలో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టాడో తెలుసా..?

భారత జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లో ఎలా రాణిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇదే రీతిలో బిజినెస్ లో కూడా విరాట్ కోహ్లీ తనదైన స్టైల్ లో రాణిస్తున్నాడు.

స్టార్టప్ కంపెనీల్లో విరాట్ కోహ్లీ నికర విలువ రూ.1000 కోట్ల పైమాటే.ఏఏ కంపెనీలలో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టాడో చూద్దాం.డిజిటల్ ఇన్సూరెన్స్: 2020లో విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు కెనడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్స కు డిజిటల్ ఇన్సూరెన్స్ లో 2.2 కోట్లు పెట్టారు.ఈ సంస్థ మూడేళ్లలోనే 84 మిలియన్ డాలర్ల నిధిని సేకరించింది.

ప్రస్తుతం దీని విలువ 87 మిలియన్ డాలర్లకు చేరింది.హై పెరిస్: 2021లో విరాట్ కోహ్లీ ఈ సంస్థలో పెట్టుబడి పెట్టడంతో పాటు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.దీంతో కోహ్లీ గ్లోబల్ సూపర్ స్టార్ లలో స్థానం సంపాదించాడు.

ఈ కంపెనీలో విరాట్ కోహ్లీ ఎంత పెట్టుబడులు పెట్టాడు అనే దానిపై పూర్తి స్పష్టత లేదు.

యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ ప్రైవేట్ లిమిటెడ్: 2020లో విరాట్ కోహ్లీ ఈ సంస్థలో రూ.19.3 కోట్ల పెట్టుబడులు పెట్టాడు.ఈ కంపెనీలో భారత జట్టు మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా పెట్టుబడులు పెట్టాడు.

Advertisement

చిసెల్ ఫిట్ నెస్: 2015లో విరాట్ కోహ్లీ ఈ సంస్థలో దాదాపుగా రూ.90 కోట్ల పెట్టుబడులు పెట్టాడు.దేశవ్యాప్తంగా జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి చిసెల్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు.

రేజ్ కాఫీ:ఇది ఒక ఢిల్లీ ఆధారిత FMCG బ్రాండ్.2018 లో ఇది ప్రారంభమైంది.విరాట్ కోహ్లీ 2022లో ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు.

ప్రస్తుతం ఈ సంస్థ దేశవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది.బ్లూ ట్రైబ్: ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగించే విధానాన్ని మార్చడమే బ్లూ ట్రైబ్ కంపెనీ ప్రధాన లక్ష్యం.ఈ కంపెనీలో విరాట్, అనుష్క దంపతులు పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా వ్యవహరిస్తున్నారు.మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ కంపెనీలలో విరాట్, అనుష్క దంపతుల నికర విలువ రూ.1000 కోట్ల పైమాటే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు