ఈ సువిశాల భూ గ్రహంలో ఎన్నో జీవరాసులు మనుగడను సాగిస్తున్నాయి.ఒక్కో జీవి జీవన సైకిల్ ఒక్కో విధంగా ఉంటుంది.
ముఖ్యంగా ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడుకుంటే… కొన్ని జీవులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని కంటే, మరికొన్ని జీవులు మనిషికి మల్లే డైరెక్టుగా పిల్లల్ని కంటాయి.ఈ క్రమంలో దేని ప్రత్యేకత దానిదే.
ఈ క్రమంలో రంగులు మార్చే ఊసరవెల్లి ( Chameleon )గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఊసరవెల్లి గురించి ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన పనిలేదు.ఎందుకంటే ప్రతిఒక్కరూ ఈ పేరుని తమ దైనందిత జీవితంలో సందర్భానికి తగ్గట్టు వాడేవారే.ఎవరన్నా ఆడిన మాట తప్పి, మరో మాటను వాడినపుడు ‘ఊసరవెల్లిలాగ మాట్లాడకు’ అని అంటూ వుంటారు.
దానికి కారణం… ఊసరవెల్లి పరిసరాలకు తగ్గట్టు తన శరీరపు రంగులను మార్చుకోవడమే.ఇది దాని ప్రత్యేకత అనిచెప్పుకోవాలి.ఈ విషయం దాదాపు అందరికీ తెలిసినదే.

అదే విధంగా ఊసరవెల్లి జాతులలో రకరకాలు ఉంటాయి.తాజాగా బిటాహియాటస్ ( bitahiatus )అనే ఊసరవెల్లి జాతికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దానికి కారణం అది పిల్లల్ని కనడం.
అవును, ఇది గుడ్లు పెట్టని కొన్ని ఊసరవెల్లి జాతులలో ఒకటిగా చెప్పుకోవచ్చు.ఇది మనుషులకు మల్లే పిల్లని డైరెక్టుగా కంటుంది.
ఈ బిటాహియాటస్ అనే ఊసరవెల్లి లైంగికంగా కలవడం వల్ల ప్రెగ్నెన్సీ కాదు.దానికి అంటుకునే పొరలను అదే వేరు చేయడం వలన పిల్లలకు జన్మనిస్తుంది.
కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది పిల్లల్ని కనేటప్పుడు తీవ్రమైన నొప్పిని భరిస్తుందని ఇపుణులు చెబుతున్నారు.







