ముంబైలో సూర్య కొన్న లగ్జరీ ఇంటి విలువ ఎంతో తెలుసా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సూర్య(Suriya) ఒకరు.ఇలా తమిళనాడులో ఎంత పాపులారిటీ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈయన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఉంటాయి.

 Do You Know How Much The Luxury House Bought By Surya In Mumbai Is Worth, Mumbai-TeluguStop.com

ఇలా తెలుగులో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.సూర్య గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.

Telugu Luxury, Mumbai, Suriya-Movie

కుటుంబ కలహాల కారణంగా ఈయన తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో(Mumbai) నివసించబోతున్నారని ఇప్పటికే ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే తాజాగా ఈయన ముంబైలో కొనుగోలు చేసినటువంటి ఆ ఫ్లాట్ ఖరీదు గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.సూర్య ముంబైలోని సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే గేటెడ్ కమ్యూనిటీలో( Gated community ) ఈ ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇలా ముంబైలో కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్ ఖరీదు సుమారు 70 కోట్ల విలువ చేస్తుందని సమాచారం.

Telugu Luxury, Mumbai, Suriya-Movie

సూర్య కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్ దాదాపు తొమ్మిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని తెలుస్తుంది.అలాగే స్విమ్మింగ్ పూల్ థియేటర్ పార్కింగ్ స్పాట్ ఇలా అన్ని సౌకర్యాలతో ఈ ఫ్లాట్ ఉందని సమాచారం.ఈ ఫ్లాట్ 68 కోట్లు విలువ చేయగా బుకింగ్ ఇతరతా ఖర్చులు కలిపి 70 కోట్ల వరకు విలువ చేస్తుందని తెలుస్తుంది.ఇలా ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య ఇకపై తన భార్య పిల్లలతో కలిసి ముంబైలోనే నివసించబోతున్నారని సమాచారం.

అయితే ఈ విషయం గురించి సూర్య ఎక్కడ అధికారకంగా ప్రకటించకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube