Arjun : హీరో అర్జున్ కూతురు ఎంగేజ్మెంట్ రింగ్ కి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో తెలుసా..?

యాక్షన్ కింగ్ అర్జున్ ( Action King Arjun ) సినిమాల్లో తనదైన నటనతో సౌత్ లో మంచి ఇమేజ్ సంపాదించారు.ఈయన అప్పట్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించారు.

 Do You Know How Many Lakhs Spent On The Engagement Ring Of Hero Arjuns Daughter-TeluguStop.com

ఇక ఈయన నటించిన సినిమాలు ఇప్పటికి టెలివిజన్లో వచ్చినా కూడా చాలామంది టీవీలకు అతుక్కొని మరీ చూస్తారు.అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి.

అయితే అర్జున్ కి హీరోగా అవకాశాలు తగ్గాక కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటిస్తున్నారు.అలా రామ రామ కృష్ణ కృష్ణ, లై (Lie వంటి సినిమాల్లో కూడా కనిపించారు.

ఇక ఈయన కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ,హిందీ భాషల్లో కూడా చేశారు.

Telugu Arjun, Aishwarya Arjun, Thambi Ramaiah, Vishwak Sen-Latest News - Telugu

అలాగే నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.అయితే అలాంటి అర్జున్ కూతురు ఐశ్వర్య ( Aishwarya ) ని కూడా సినిమాల్లో హీరోయిన్ గా పరిచయం చేశారు.ఈమె తమిళ,కన్నడ భాషల్లో రెండు మూడు సినిమాల్లో చేసింది.

అలాగే విశ్వక్ సేన్ ( Vishwak sen ) తో కలిసి తెలుగులో ఓ సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు.అంతే కాదు ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా అటకెక్కింది.

అయితే గత కొద్ది రోజుల నుండి ఐశ్వర్య తమిళ్ కమెడిన్ తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ప్రేమలో ఉందని ఎన్నో వార్తలు వచ్చాయి.

Telugu Arjun, Aishwarya Arjun, Thambi Ramaiah, Vishwak Sen-Latest News - Telugu

అయితే వీటిపై ఐశ్వర్య గాని అర్జున్ గాని క్లారిటీ ఇవ్వలేదు.సడన్ గా తంబి రామయ్య కొడుకు ఉమాపతి ( Umapathy ) తో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.ఇక వీరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.

అయితే అర్జున్ తన కూతురు ఐశ్వర్య ఎంగేజ్మెంట్ రింగు ని చాలా స్పెషల్ గా చేయించారట.అంతేకాదు ఆ చిన్న రింగుకి లక్షలు ఖర్చు పెట్టారట.మరి ఇంతకీ ఆ రింగు కాస్ట్ ఎంతో తెలిస్తే మీరందరూ నోరెళ్లబెడతారు.ఎందుకంటే ఆ రింగు ధర దాదాపు 20 లక్షలని సమాచారం.

ఆ రింగు 5 క్యారెట్స్ బంగారంతో బ్లడ్ రూబీ కలర్ లో ఉంది.ఇక ఈ రింగ్ స్పెషల్ గా బర్మాలో చేయించి తీసుకువచ్చారట.

అందుకే ఈ రింగ్ ఖరీదు 20 లక్షలు ఉందని తెలుస్తోంది.ఎంగేజ్మెంట్ కే 20 లక్షలు ఖర్చు పెడితే పెళ్లికి,పెళ్లి నగలకి,పెళ్లి చీరలకు ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో అని ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube