నెయ్యి, నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో తెలుసా?

నెయ్యి, నిమ్మ‌ర‌సం.ఈ రెండు ప‌దార్థాల‌ను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాము.

వేరు వేరు రుచుల‌ను క‌లిగి ఉండే ఈ రెండిటిలోనూ బోలెడ‌న్ని పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.అవి మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేస్తాయి.

అయితే నెయ్యి, నిమ్మ‌ర‌సం విడి విడిగా కాకుండా క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు.క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం నెయ్యి, నిమ్మ‌ర‌సం క‌లిపి ఎలా తీసుకోవాలి.? అస‌లు అలా తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభాలు ఏంటి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ నెయ్యి, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం వేసి బాగా క‌లిపి.

Advertisement
Do You Know How Many Health Benefits Of Ghee And Lemon Juice Together? Ghee, Lem

ఉద‌యం ఖాళీ క‌డుపుతో సేవించాలి.ఈ విధంగా నెయ్యి, నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకుంటే బాడీలో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది.వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.దాంతో వేగంగా బ‌రువు త‌గ్గుతారు.

అలాగే పైన చెప్పిన విధంగా నెయ్యి, నిమ్మర‌సం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగ్గా మారుతుంది.గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ధ‌కం, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.

ప్రేగు సంబంధిత వ్యాధులు మరియు పిత్తాశయ వ్యాధులను కూడా నయం అవుతాయి.

Do You Know How Many Health Benefits Of Ghee And Lemon Juice Together Ghee, Lem
న్యూస్ రౌండప్ టాప్ 20

అంతేకాదండోయ్‌.గోరు వెచ్చ‌ని నీటిలో నెయ్యి, నిమ్మర‌సం క‌లిపి ఖాళీ క‌డుపుతో తీసుకుంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.సీజ‌నల్ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Advertisement

బాడీ రోజంతా యాక్టివ్‌గా ఉంటుంది.ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.

ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి కాబ‌ట్టి.త‌ప్ప‌కుండా నెయ్యి, నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

తాజా వార్తలు