తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శన వేళల గురించి మీకు తెలుసా?

తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శన వేళలు ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటాయి.

స్వామి వారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను తితిదే నిర్దేశించింది.

టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ దర్శన్, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది.ఉదయం నుంచి సాయంత్రం లోపు నిర్దేశించిన సమయంలో శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు.

ఎంపిక చేసుకున్న సయమం టిక్కెట్లపై ముద్రితం అవుతుంది.ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస వద్దకు రావాల్సి ఉంటుంది.

ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం 300 ధర వంతున 26 వేల టిక్కెట్లను అందు బాటులోకి తీసుకు వచ్చింది.అలాగే 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది.

Advertisement

విశేష పర్వ దినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని టిక్కెట్ల సంఖ్యను దేవ స్థానమే తగ్గిస్తుంది.ఆది, సోమ, మంగళ వారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్వామి వారిని దర్శించుకోవచ్చు.

బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శించుకోవచ్చు.అలాగే గురు వారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, శుక్ర వారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శించుకోవచ్చు.

ఇలా కేవలం కేటాయించిన సమయాల్లో మాత్రమే స్వామి వారిని దర్శించుకునే వీలుంటుంది.

కరోనా వల్ల ఆ అవయవానికి డేంజర్.. అది ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు