ఏడాదిలో కేవలం 5 నెలలే తెరిచే 'యస్ బి ఐ' బ్రాంచ్ ఏదో మీకు తెలుసా?

వింటుంటే ఆశ్చర్యం వేస్తోంది కదా.ఈ విషయం మీరు బహుశా ఫస్ట్ టైం విని వుంటారు.

 Do You Know Any 'sbi' Branch Which Is Open Only 5 Months In A Year? Sbi, Branc-TeluguStop.com

లేకపోతే ఏడాదిలో కేవలం 5 నెలలే తెరిచే ‘యస్ బి ఐ( SBI )’ బ్రాంచ్ ఎక్కడుంటుంది అనే అనుమానం మీలో చాలామందికి కలగక మానదు.అవును, దేశీయ అతి పెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దాదాపు అన్ని చోట్లా బ్రాంచ్ లు కలవు.

సేవింగ్స్ అకౌంట్, రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, చెక్ బుక్స్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వివిధ రకాల సేవలందించడంలో స్టేట్ బ్యాంకుకి మంచి పేరుంది.మారుమూల ప్రాంతాల్లో కూడా స్టేట్ బ్యాంక్ సేవలున్నాయి అని మనందరికీ తెలిసిందే.

అయితే ఏడాదిలో కేవలం 5 నెలలు మాత్రమే తెరిచి ఉంటే స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ఒకటుందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ బ్యాంక్ ఇండియా-చైనా సరిహద్దులో ఉంది.ఏడాదిలో 5 నెలలు మాత్రమే ఇది తెరుచుకుంటుంది.ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌( Pithoragarh )లో చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుంజిలో వుంది.

అక్కడ వాతావరణం కారణంగా సంవత్సరంలో 4 నుంచి 5 నెలలు మాత్రమే ఇది ఓపెన్ చేసి ఉంటుంది.అయితే గుంజి ప్రజలకు ఏడాది పొడవునా బ్యాంకు అవసరం.కానీ కేవలం సమ్మర్ టైమ్ లో మాత్రమే సర్వీస్ చేస్తుంది ఈ బ్రాంచ్.

ఇక ఈ బ్యాంకు సహాయంతో, మానసరోవర్ యాత్రికులు అలాగే ఇండో-చైనా వాణిజ్యంలో పాల్గొన్న వ్యాపారులు నగదు లావాదేవీలు జరుపుతారు.ధార్చుల తర్వాత లిపులేఖ్ మోటర్‌వేపై ఉన్న ఏకైక బ్యాంకు ఇదే.దీనికి ఇంటర్నెట్‌ అనుసంధానం ఉండదు.అయితే బ్యాంక్ బ్రాంచ్‌కి దాని సొంత సర్వర్‌ని శాటిలైట్‌( Satellite )కి కనెక్ట్ చేయడం వలన ఇక్కడ లావాదేవీలు అనేవి ప్రభావితం కావు.

ఈ బ్రాంచ్ లో ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉంటారు.ఈ సారి ఈ బ్యాంకు జూన్ ప్రారంభం నుంచి అక్టోబర్ చివరి వరకు తెరిచి ఉంటుంది.కావాలంటే అక్కడికి వెళ్లి చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube