ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న ఫోన్లలో 90% ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓఎస్(Android OS) వినియోగం ఎక్కువగా ఉంది.అంటే ఐఫోన్ మినహా దాదాపుగా అన్ని మొబైల్లో ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంది.
ఆండ్రాయిడ్ సిస్టంలో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.కానీ ఆండ్రాయిడ్ ఓఎస్ వినియోగించే వారికి దీని ఫీచర్స్ గురించి పెద్దగా తెలియదు.
కేవలం కొన్ని ఫీచర్లను మాత్రమే వినియోగిస్తూ, అవగాహన లేని ఫీచర్ల అవసరం ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఒకసారి ఆండ్రాయిడ్ ఫీచర్లపై అవగాహన తెచ్చుకుంటే, కొన్ని పనులు సులభంగా, వేగంగా చేసుకోవచ్చు.

రెండు స్మార్ట్ ఫోన్ లను మెయింటైన్ చేయడం చాలా కష్టం.కానీ స్ప్లిట్ స్క్రీన్(Split Screen) పేరుతో ఒకే మొబైల్ లో రెండు స్క్రీన్లు వినియోగించుకోవచ్చు.అంటే ఒకేసారి రెండు వేరువేరు యాప్ లను మొబైల్లో ఓపెన్ చేయవచ్చు.ట్రాన్స్ లేటర్ ఫీచర్(Translator) విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా అవసరం అవుతుంది.ఎలా అంటే ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే కెమెరా యాప్ ద్వారా కనిపించిన టెక్స్ట్ ఫోటోలను క్లిక్ చేసి, టెక్స్ట్ లను ట్రాన్స్ లేట్ చేసుకుని అర్థం చేసుకునే ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

వన్ హ్యాండ్ మోడ్ ఫీచర్(One Hand Mode) అనేది ఒక చేత్తో మొబైల్ వినియోగిస్తున్నప్పుడు స్వైప్ తో ఇంటర్ ఫేస్ కిందికి జరిగినప్పుడు బొటన వేలు ద్వారా సులభంగా స్క్రీన్ పై భాగంలో సగాన్ని ఈ ఫీచర్ తో తగ్గించవచ్చు.వినికిడి సమస్య ఉండే వాళ్లకు లైవ్ ట్రాన్స్ క్రైబ్ ఫీచర్ ఎంతో సహాయపడుతుంది.ఫోన్లో నీ వాయిస్ ని టెక్స్ట్ గా మారుస్తుంది.
జస్ట్ ఫోన్లో ఈ ఫీచర్ ఆన్ మోడ్ లో ఉంటే ఆడియోను టెక్స్ట్ గా మారుస్తుంది.స్మార్ట్ లాక్ ఫీచర్ తో ప్రతిసారి అన్లాక్ చేయాల్సిన అవసరం ఉండదు.
మీరు సురక్షితం గా భావించే ప్రదేశాలలో ఈ ఫీచర్ ను ఆటోమేటిక్ సెట్టింగ్స్ చేసుకుంటే, సురక్షిత ప్రదేశాలలో అన్లాక్ అవుతుంది.మిగతా ప్రదేశాలలో లాక్ పడిపోతుంది.







