పాపాంకుశ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి ( Papankusa Ekadashi )అని పిలుస్తారు.

ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విష్ణువు ( Vishnu )అవతారమైన పద్మనాభుడిని పాపాంకుశ ఏకాదశి రోజు పూజిస్తారు.ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉండి సకల సంతోషాల కోసం పద్మనాభుడిని పూజిస్తారు.

పేరుకు తగ్గట్టుగానే పాపాంకుశ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పద్మనావుడిని పూజిస్తే పాపపుణ్యాల నుంచి విముక్తి పొందవచ్చు అని భక్తులు నమ్ముతారు.దృక్ పంచాంగం( Drik Panchangam ) ప్రకారం ఈ ఏడాది పాపాంకుశ ఏకాదశిని అక్టోబర్ 25 బుధవారం రోజు జరుపుకున్నారు.

Do You Know About The Importance Of Papankusa Ekadashi , Papankusa Ekadashi, Lor

24వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల 14 నిమిషములకు మొదలై అక్టోబర్ 25వ తేదీన మధ్యాహ్నం 12:32 నిమిషములకు ముగిసిపోయింది.ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం తర్వాత పారాణా నిర్వహిస్తారు.పారణ అంటే ఉపవాసం విరమించడం అక్టోబర్ 26వ తేదీ ఉదయం 6.28 నిమిషముల నుంచి 8.43 నిమిషముల వరకు శుభముహూర్తం ఉంది అని పండితులు చెప్పారు.ముఖ్యంగా చెప్పాలంటే పద్మనాభుడి అనుగ్రహం పొందాలనుకునే వారు పాపాంకుశ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు.

Advertisement
Do You Know About The Importance Of Papankusa Ekadashi , Papankusa Ekadashi, Lor

తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి సమస్యలను పరిష్కరించమని విష్ణువును పూజిస్తారు.విష్ణువు సంతృప్తి చెంది భక్తులకు కోరిన కోరికలను వరాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.

Do You Know About The Importance Of Papankusa Ekadashi , Papankusa Ekadashi, Lor

మరణ చక్రం నుంచి విముక్తి మరియు మోక్షాన్ని పొందవచ్చని కూడా నమ్ముతారు.ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించే వారికి యముడు ఎటువంటి ఇబ్బందిని కలిగించాడని భక్తులు నమ్ముతారు.అలాగే ఈ రూపంలో తులసి ఆకులు కొయ్యడం, మద్యం సేవించడం, తమాసిక ఆహారాలు తీసుకోవడం నిషేధం అని పండితులు చెబుతున్నారు.

అలాగే ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు ముగించుకొని పూజ సామాగ్రిని అమర్చి, పూలు, ధూపం, దీపం, హారతి సమర్పించి విష్ణువుకి పూజ చేయాలి.సాయంత్రం ఏకాదశి కథ విన్న, పఠించినా తర్వాత విష్ణు సహస్రనామ పరాయణం చేసి మళ్లీ ఏకాదశి పూజ చేయాలి.

హారతి చేసిన తర్వాత సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఉపవాసాన్ని విరమించావచ్చని పండితులు చెబుతున్నారు.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు