ఆరంభంలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొని, “అందాల రాక్షసి”( Andala Rakshasi ) చిత్రంతో తొలిసారిగా హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు నవీన్ చంద్ర( Naveen Chandra ).ఈ సినిమాలో నవీన్ నటనకు ఫిదా అవ్వనివారు లేరు.
అందాల రాక్షసి మంచి విజయం సాధించడంతో, నవీన్ కు వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి.ఐతే కేవలం హీరో పాత్రలే చేస్తానని మొండి పట్టుదల పెట్టుకోకుండా, ఏ మంచి పాత్ర వచ్చిన కాదనకుండా చేసుకుంటూ పోతున్నాడు నవీన్.
వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఇతను, త్వరలో ఒక కొత్త చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు.నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం “మంత్ అఫ్ మధు”( Month of Madhu ).
ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన భార్య గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు.
గతంలో నవీన్ పలుమార్లు తన భార్యతో కలసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసాడు.ఈ మధ్యే వీరికి ఒక బాబు కూడా పుట్టాడు.నవీన్ భార్య పేరు ఒర్మ( Naveen Chandra Wife Orma ).
ఈమె స్వస్థలం కేరళ.వీరిది ప్రేమ వివాహం.
నవీన్ ఇప్పటి వరకు తన కుటుంబ విషయాలను ఎప్పుడు బహిర్గతం చెయ్యలేదు.అందుకే అతని భార్య గురించి ఎవ్వరికీ పెద్దదిగా తెలియదు.
తాజాగా నవీన్ తన భార్య గురించి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తన సక్సెస్ కు కారణం తన వైఫ్ అని చెప్పుకొచ్చాడు.తన దగ్గరకు వచ్చే ప్రతి కథను తన భార్యకు వినిపిస్తాడట నవీన్.
అతను కేవలం హీరో అన్న అంశానికి పరిమితం కాకుండా, ఇలా విభిన్న పాత్రలు చెయ్యడానికి కారణం కూడా అతని భార్యేనట.నవీన్ చంద్ర భార్య చాలా కాలం మలయాళం ఇండస్ట్రీ( Malayalam Industry )లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశారట.ఆమెకు సినిమాల పై మంచి అవగాహనా ఉందని, అవకాశం వస్తే భవిష్యత్తులో డైరెక్టర్ గా మారె అవకాశం కూడా ఉందని అన్నారు నవీన్ చంద్ర.నవీన్ తన భార్య గురించి బయట పెట్టిన విషయాలను విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.