Hero Ajith: పక్షవాతాన్ని కూడా లెక్క చెయ్యని స్టార్ హీరో….కష్టం అంటున్న డాక్టర్లు!

అజిత్( Hero Ajith ) తమిళ స్టార్ హీరోలలో ఒకరు.కేవలం తమిళ్ లోనే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో కూడా ఈయనకు చాలా మంది అభిమానులున్నారు.

 Do You Know About Hero Ajith Health-TeluguStop.com

అజిత్ సినిమా రిలీజ్ కు రెండు రాష్ట్రాలలో జరిగే హడావిడి అంత ఇంత కాదు.ఈ స్టార్ హీరోకు సినిమాలతో పాటు, బైక్ రేసింగ్ అంటే మహా పిచ్చి.

ఎప్పటికప్పుడు విదేశాలకు వెళ్లి, సరదాగా తన బైక్ మీద షికారు చేస్తూ ఉంటాడు.

సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా చెయ్యడానికి వెనుకాడడు ఈ స్టార్ హీరో.

ఐతే ఇప్పుడు ఆ రిస్కులే అజిత్ కు శాపంగా మారేలా ఉన్నాయ్.సినిమాలో ఆయన చేసిన స్టంట్ ల ( Movie Stunts ) వలన జరిగిన ప్రమాదాల కారణంగా అనేక సర్జరీలు ( Surgery ) జరిగాయి.

ఎన్ని ప్రమాదాలు జరిగిన, తిరిగి కోలుకొని, ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతున్నాడు.తాజాగా ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్, అజిత్ ఆరోగ్యం పై సంచలన కామెంట్స్ చేసాడు.

Telugu Ajith, Ajith Abbas, Ajith Paralysis, Abbas, Prema Desam-Movie

హీరో అబ్బాస్( Abbas ) ప్రేమ దేశం చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించాడు.తరువాత వరుస లవ్ స్టోరీస్ చేసి లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించాడు.తెలుగు, మలయాళం, తమిళ భాషలలో అనేక సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అబ్బాస్, గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా విదేశాలలో ఉంటున్నారు.ఈ మధ్య చెన్నై వచ్చిన ఈయన ఒక ఇంటర్వ్యూ లో అజిత్ గురించి మాట్లాడారు.

Telugu Ajith, Ajith Abbas, Ajith Paralysis, Abbas, Prema Desam-Movie

అజిత్ చాలా ముక్కుసూటి మనిషి అని, ఆయనకు అబధం చెప్తే నచ్చదని, అది ఎంత చేదు వార్త అయినా నిజమే చెప్పాలని అన్నాడు.అజిత్ కు గతంలో జరిగిన సర్జరీల కారణంగా పక్షవాతం ( Paralysis ) వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారని చెప్పారు.కానీ అజిత్ డాక్టర్ల మాటలను లెక్క చేయకుండా అభిమానులకోసం సినిమాలు చేస్తున్నాడని అన్నారు.హీరో అబ్బాస్ చెప్పిన ఈ మాటలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube