మీ కళ్ళకు సైట్ వుందా? అయితే కళ్లద్దాలను పక్కనపెట్టి ఈ ఐ డ్రాప్స్‌ వేసుకోండి?

కంటి చూపు సమస్య అనేది ఇపుడు చిన్నపిల్లలనుండి పెద్దవాళ్లవరకు వేధించే అతి పెద్ద సమస్య అయిపోయింది.మన దేశంలో వున్న యూత్ దాదాపు 70 శాతం మంది కళ్లజోళ్లు ధరిస్తున్నారని ఓ సర్వే.

 Do You Have A Site For Your Eyes But Put These Eye Drops Aside , Eye Drops, Eye-TeluguStop.com

దీని ప్రకారం అర్ధం చేసుకోండి.కంటిచూపు సమస్య అనేది యెంత రీతిగా ప్రబలిందో.

అయితే మనలో అనేకమందికి కళ్లజోళ్లు పెట్టుకోవడం ఇష్టముండదు.సరే లేజర్ ట్రీట్మెంట్ చేసుకుందామంటే డబ్బులు లేని పరిస్థితి వుంది.

అందుకే దాదాపు ఇక్కడ అందరూ కళ్ళజోళ్ళనే ఆశ్రయిస్తారు.అయితే ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఆరోగ్య నిపుణులు నిరంతరం శ్రమిస్తూనే వున్నారు.

ఈ నేపథ్యంలో కంటి చూపు మెరుగయ్యేందుకు తాజాగా ఐ డ్రాప్స్ డెవలప్ చేశారు అమెరికా శాస్త్రవేత్తలు.ఈ డ్రాప్స్ రెండు కళ్లలో వేసుకుంటే చాలు.కంటి చూపు మెరుగవుతుందని చెబుతున్నారు.అమెరికాకు చెందిన FDA (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) కూడా ఈ డ్రాప్స్‌కు అనుమతించింది.

అమెరికాలో ఏ కొత్త ఔషధం మార్కెట్లోకి రావాలన్నా FDA అనుమతి తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు FDA అనుమతితో త్వరలోనే ఈ డ్రాప్స్ మార్కెట్లోకి రానున్నాయి.

విటీ’ అనే పేరుతో ఈ డ్రాప్స్ తయారు చేయబడ్డాయి.వీటిని ప్రతి రోజూ రెండు కళ్లల్లో వేసుకోవాల్సి ఉంటుంది.

Telugu Eye Drops, Eye, Laser, Drops, Problem, Sepitical, Vuity-Latest News - Tel

ఈ డ్రాప్స్ వేసుకున్న 15 నిమిషాల తర్వాత కంటి చూపు మెరుగవుతుందని గ్యారంటీ ఇస్తున్నారు.అయితే దీని ప్రభావం 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది.ఆ తర్వాత అవసరమైతే మళ్లీ డ్రాప్స్ వేసుకోవాలి.ఈ డ్రాప్స్ కేవలం దగ్గర వస్తువులు సరిగ్గా కనిపించని వారికి మాత్రమే ఉపయోగపడతాయి.దగ్గరి వస్తువులు మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తాయి ఈ డ్రాప్స్.40-45 ఏళ్ల వయసు వారికి ఇవి బాగా పనిచేస్తాయని తయారీదారులు అంటున్నారు.దాదాపు 750 మందిపై పరిశోధనలు జరిపి ఈ డ్రాప్స్ తయారు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube