హెల్త్ బీమా విషయంలో క్యాష్‌లెస్ క్లయిమ్‌లు రిజెక్ట్ కాకుండా ఇలా చేయండి!

హెల్త్ బీమా. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం అంటే, కరోనా మహమ్మారి ముందు దీని గురించి ఎవరూ సరిగ్గా పట్టించుకోలేదు గాని, ఆ తర్వాత దాదాపు ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తప్పక తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్‌లో అందుబాటులో ఉన్న నగదు రహిత వైద్య చికిత్స పాలసీదారులకు ఎంతో మేలు చేకూరుస్తుంది.గతంలో అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా ఒక్కోసారి వైద్య చికిత్స బిల్లు చెల్లించాల్సి ఉండేది.ఆ తర్వాత రీయింబర్స్ మెంట్ క్లయిమ్ చేసుకున్నా.

ఆసుపత్రిలో బిల్లు చెల్లింపునకు అవసరమైన మనీ కోసం నానా తంటాలు పడాల్సి వచ్చేది.

Advertisement

కానీ నేడు పరిస్థితి దాదాపుగా మారింది.క్యాష్ లెస్ క్లయిమ్ పేమెంట్స్ ద్వారా ఇన్సూరెన్స్ సంస్థలే నేరుగా ఆసుపత్రి యాజమాన్యానికి బిల్లు పే చేస్తున్నాయి.అయినా, కొన్ని సందర్భాల్లో క్యాష్ లెస్ క్లయిమ్‌లు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది.క్యాష్ లెస్ క్లయిమ్ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలంటే పాలసీదారు.

సంబంధిత సంస్థ నెట్ వర్క్ దవాఖానలో మాత్రమే చికిత్స పొంది తీరాలి.నాన్-నెట్ వర్క్ దవాఖానలో అడ్మిట్ అయితే క్యాష్ లెస్ క్లయిమ్ అవకాశం ఉండదు.

దీనికోసం మొదట పాలసీ దారుడు సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థ నెట్ వర్క్ పరిధిలోని ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినప్పటికీ క్యాష్ లెస్ క్లయిమ్ పొందడానికి అనుమతి కోరుతూ ముందే ఫ్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది.దానికోసం వైద్య పరీక్షల రిపోర్టులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తదితర మెడికల్ పత్రాలు అనేవి పంపాలి.అలా ఇలా పంపిన పత్రాల్లో తప్పులు ఉన్నా, అసంపూర్ణంగా ఉన్నా రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
వైరల్ : తల్లిదండ్రుల ప్రేమకు మించి మరొక ప్రేమ లేదనడానికి ఇదే ఉదహరణ కాబోలు..

అందుకే ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నాయి సదరు ఇన్సూరెన్స్ కంపెనీలు.ఇకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ, పాలసీలోని లిస్టులో ఇవ్వబడిన వ్యాధులకు మాత్రమే కవరేజీ ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.

Advertisement

తాజా వార్తలు