వారంలో కేవలం రెండు సార్లు ఇలా చేస్తే 60 లోనూ యంగ్ గా మెరుస్తారు!

వయసు పైబడిన తర్వాత కూడా యవ్వనంగా మెరిసిపోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.కానీ ప్రస్తుత రోజుల్లో అది అసాధ్యంగా మారింది.

ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, కాలుష్యం, కంటి నిండా నిద్ర లేకపోవడం, ధూమ‌పానం తదితర అంశాలు అందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.అయితే కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక పాటిస్తే అర‌వైలోనూ యంగ్ గా మెరిసిపోవడం ఖాయం.

మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి పాలు వేసుకోవాలి.అలాగే బంగాళదుంప తురుము( potato ) వేసి కనీసం ప‌ది నిమిషాల పాటు గరిటెతో తిప్పుకుంటూ ఉడికించాలి.

Advertisement
Do This Just Twice A Week And You Will Look Young At 60! Young Look, Latest News

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.

Do This Just Twice A Week And You Will Look Young At 60 Young Look, Latest News

కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత పల్చటి వస్త్రం సహాయంతో స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ క్రీమ్ లో ఒక ఎగ్ వైట్( Egg white ), వన్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ( Almond oil )వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకోవాలి.

Do This Just Twice A Week And You Will Look Young At 60 Young Look, Latest News

కాస్త ఆరిన తర్వాత మరోసారి తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాసుకోవాలి.ఇర‌వై నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారంలో కేవలం రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చర్మం టైట్ గా మారుతుంది.

ముడతలు, సన్నని చారలు, చర్మం సాగటం తదితర వృద్ధాప్య లక్షణాలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.వయసు పైబడిన సరే యంగ్ గా మరియు కాంతివంతంగా మెరిసిపోతారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు