భారత దేశంలో చారిత్రకంగా దళిత సమాజం నుండి ముస్లింలుగా మారిన దళిత ముస్లింలకు, దళిత సమాజం నుండి క్రైస్తవులు గా మారిన దళిత క్రైస్తవులకు దళిత హోదా కల్పించే అంశంపై అక్టోబర్ 11 -2022 న సుప్రీంకోర్టు లో కేసు విచారణ జరగింది.
ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం గత్యంతరంలేని పరిస్థితిలో అక్టోబర్ 6 -2022 న వీరి స్థితిగతులపై అధ్యాయానికి అత్యున్నత స్థాయి కమిషన్ ను సుప్రీంకోర్టు మాజి ప్రధాన న్యామూర్తి అధ్యక్షతన జస్టిస్ కే.
జి.బాలకృష్ణన్ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కూడిన కమిషన్ ను ఏర్పాటుచేసింది .ఈ కమిషన్ ను , కమిషన్ అఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952 సెక్షన్ 3 ప్రకారం ఏర్పాటు చేస్తున్నమని కేంద్ర సామజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ తన గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.బాలకృష్ణన్ కమిషన్ నియామక ఉత్తర్వుల్లోని ప్రధాన లోపం ఏమిటంటే ఎప్పటినుండి మతం మారిన దళితులగూర్చి అధ్యయనం చేయాలనే విషయంలో స్పష్టతలేదు.
దీన్ని ప్రభుత్వమే సరిచేయాలి.అయితే 1950 ఆగష్టు 10 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులమేరకు షెడ్యూలు కుల హోదా తొలగించబడిన "హిందూ "ఏతర దళితుల గూర్చి బాలకృష్ణన్ కమిషన్ అధ్యయనం చేయవలిసిఉంది.
దళిత మూలాలు ఉన్న ముస్లింలు , క్రైస్తవుల పై ఎలాంటి సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు .ఈ సమాచారాన్ని సేకరించటం బాలకృష్ణన్ కమిషన్ యొక్క మొదటి పని , దీని కోసం దేశం నలుమూలనుంచి దళిత ముస్లింలు , దళిత క్రైస్తవులు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని బాలకృష్ణన్ కమిషన్ కు వినతిపత్రాలు ద్వారా సమర్పించాలి .ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 కు ముందుగా దళిత హోదా ఉన్న ముస్లిం జనసముదాయాలను, దళిత ముస్లింలుగా, దళిత హోదా ఉన్న క్రైస్తవ జనసముదాయాలను దళిత క్రైస్తవులు గా పిలవబడుతున్నారు.వీరిలో కొందరు జీవనోపాధి కొరకు పారిశుధ్య కార్మికులు గా, అంటరాని, అపరిశుభ్రమైన వృత్తుల్లో ఇప్పటికి కొనసాగుతున్నారు.
గవర్నమెంట్ అఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ముస్లింలకు , క్రిస్టియన్లకు ,సిక్కులకు రాజకీయ రిజర్వేషన్స్ 1936 లో తొలగించారు.అదే సమయంలో మతాన్ని మార్చుకున్న దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులు దళిత హోదా ను కల్పించింది .రాజ్యాంగపరిషత్ చర్చల్లో 1946 నుంచి 1949 వరకు మన దేశ రాజ్యాగం ఏవిదంగాఉండాలని చర్చలు జరిగాయి.మద్రాస్ రాష్ట్రము నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరుపున ముహమ్మద్ పోకర్ సహాబ్ 1909 నుచి 1936 వరకు ఉన్నముస్లిం రాజకీయ రిజర్వేషన్స్ ను కొనసాగించాలని రాజ్యాంగపరిషత్ చర్చల్లో ఆయన వాదించారు.
దేశ రాజ్యాగం లో మైనారిటీ హక్కుల కొరకు హెచ్.సి ముఖర్జీ కమిటీని నియమించారు, దీనిలో 11 మంది సభ్యులలో ఒక్క ముస్లింను కూడా సభ్యుడిగా నియమించలేదు.
అంబేత్కర్ తో పాటు మరో ఇద్దరు సభ్యులు మాత్రమే ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్స్ కొనసాగించాలని తీర్మానించారు.కానీ ఈ తీర్మానం 3 :11 నిష్పత్తిలో వీగిపోయింది.ఈ తీర్మానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగపరిషత్ లో ప్రవేశపెట్టారు దీనిపై వాదోప వాదాలు జరిగినతరువాత హిందుత్వ వాదుల కుట్రలో భాగంగా ముస్లింలకు రాజాకీయ రిజర్వేషన్స్ లేకుండాచేశారు.
గవర్నమెంట్ అఫ్ ఇండియా యాక్ట్ 1936 లో ఉన్న కొన్ని జనసముదాయాలను దళితులుగా గుర్తించారు.ఈ దళిత కులాలకు మతంతో సంబంధంలేదు.
ఉదాహరణకు మెహతర్ కులం ముస్లింలలో, హిందువులలో ఉన్నారు.తెలుగు రాష్ట్రాల్లో లద్దాఫ్,నూర్ బాషా,దూదేకులు 1936 నుండి 1950 వరకు దళిత జాబితాలో ఉన్నాయి, దీనితోపాటుగా 96 కులాలు కూడా దళిత జాబితాలో ఉన్నాయని సచార్ కమిటీ పేజీ నెంబర్ 192 /193 లో పేర్కొంది.1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా కేవలం హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే ప్రభుత్వం దళిత హోదా ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వం 1956 లో సిక్కులకు ,1990 లో బుద్దిస్టులకు దళిత (ఎస్సి) హోదా ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ-ఈ జాబితా చూస్తే 54 జనసముదాయాలు ఉన్నాయి.ఈ జనసముదాయాలు అన్ని కూడా దళిత (ఎస్సి) హోదా కలిగివున్నాయి.హిందూ మతం లోని దళితులు ఎంత వెనుకబడి ఉన్నారో దానికంటేకూడా ముస్లింలు ,క్రైస్తవులు చాలా వెనుకబాటుతనం వున్నది .
స్వత్రంత భారతదేశంలో ఇప్పటివరకు కులాల లెక్కలు లెక్కించలేదు.దేశం లో ఇప్పటి వరకు బ్రిటీష్ ఇండియా లోని 1931 కులగణననే ప్రామాణికంగా తీసుకోని ప్రస్తుత అంచనాలను గణిస్తున్నారు.జనాభా లెక్కలో మతాన్ని పరిగణిస్తారు కానీ కులం/ కమ్యూనిటీ/ వర్గం కాలమ్ లేదు.
కమ్యూనిటీ కాలమ్ కేవలం ఎస్సి, ఎస్టి లకు మాత్రమే ఉన్నాయి.సెంటర్ ఫర్ సోషల్ అండ్ కాన్స్టిట్యూషనల్ స్టడీస్ వ్యవస్థాపక ట్రస్టీ ఆరీస్ ముహమ్మద్ గారు 1991 నుంచి 2011 జనాభా లెక్కల్లో ప్రశ్నావళి లోని 13 వ కాలమ్ లో ఓబీసీ /బీసీలను కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
వీరి నేతృత్వంలో నలుగురు ప్రతినిధుల బృందం 2010 లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిసి 2011 జనాభా లెక్కల్లో 13 వ కాలమ్ లో ఓబీసీ /బీసీలను కూడా చేర్చాలని పలుకోర్ట్ తీర్పులను ,కమిషన్ ల డిమాండ్ లను ఉట్టంకిస్తూ చేసిన విజ్ఞప్తి ఫలితంగా కులగణన కు ప్రాదిపదిక ఏర్పడింది.ప్రధాని సానుకూల హామి ఫలితంగా కులగణన 2014 న జరిగింది.
కులగణన చాలా సంక్లిష్ట ప్రక్రియ ,కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వాడకం వాల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది.కానీ 2011 జనగణన లో 13 వ కాలమ్ లో ఓబీసీ/ బీసీలను కూడా చేర్చాలనే ప్రతిపాదనను సంక్లిష్టత , కాల పరిమితుల దృష్ట్యా సెన్సెస్ కమిషర్ చేర్చలేదు.
దీని ఫలితంగా 2021 జనాభా లెక్కల్లో కాలమ్ నెంబర్ 13 లో ఎస్సి, ఎస్టి మరియు ఇతరులు అని సెన్సెస్ పట్టికలో చేర్చటంజరిగింది.కరోనా మహమ్మారి వల్ల 2021 జనాభా లెక్కలు జరగలేదు .ఇకముందు జరగబోయే జనగణన లోని 13 వ కాలమ్ లో ఎస్సి, ఎస్టి లతోపాటు కులం /జనసముదాయం /వర్గం ను కూడా చేర్చాలని డిమాండ్ చేయవలిసి ఉంది .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy