ఏపీపీఎస్సీ( APPSC )లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) అన్నారు.ఏపీపీఎస్సీలో రికార్డులను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే వైసీపీకి చట్టాలు వర్తించవా అని ప్రశ్నించిన చంద్రబాబు వైసీపీ పెట్టిన ప్రతి స్కీం వెనుక స్కాం ఉంటుందని విమర్శించారు.ఎన్డీఏకు కేంద్రంలో నాలుగు వందలకుపైగా సీట్లు వస్తాయన్నారు.
రాష్ట్రంలో కూటమికి 160 కి పైగా సీట్లు రావాలన్నారు.అదేవిధంగా ఇరవైకి పైగా ఎంపీ స్థానాలను కూటమి గెలవాలని సూచించారు.కడప ఎంపీ సీటు కూడా తామే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.అలాగే సీట్లు రాని అభ్యర్థుల బాగోగులు తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు.