రోబోలు కూడా అలసిపోతాయా.. 20 గంటలు పని చేసి పడిపోయిందిగా...

రీసెంట్ టైమ్స్‌లో రోబోలు చాలా ఫ్యాక్టరీలో కంపెనీలలో పనులు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి.మనుషులకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కానీ ఈ రోబోలకు ఛార్జింగ్ పెడితే చాలు అవి అలుపే లేకుండా చాలా వేగంగా పనులు చేస్తాయి.

 Do Even Robots Get Tired After Working For 20 Hours, Viral News, Trending News,-TeluguStop.com

తాజాగా మరొక వర్కింగ్ రోబోకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో డిజిట్ అనే పేరుతో ఒక రోబో పనులు చేయడం చూడవచ్చు.

నిజానికి ఇది దీనికి ఒక టెస్టింగ్ టైమ్‌( Testing time ).కానీ ఆ పరీక్ష సమయంలో ఇది ఇబ్బంది పడుతోంది.అజిలిటీ రోబోటిక్స్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది, దీనిని ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోకుండా పనిచేసేలా రూపొందించారు.ఆ వీడియోలో డిజిట్ 20 గంటల పాటు వివిధ పనులు చేస్తూ దాని నేర్పును చూపిస్తుంది.

కానీ పరీక్ష చివర్లో, డిజిట్ పనిచేయడం ఆగిపోయి పడిపోతుంది.దీని వల్ల కొంతమంది డిజిట్ ఎప్పుడూ నమ్మదగినదిగా పనిచేస్తుందో లేదో అనే ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వీడియోను అజిలిటీ రోబోటిక్స్ ( Agility Robotics )ముందుగా ఎక్స్ అనే సోషల్ మీడియాలో పంచుకుంది.3 మిలియన్లకు పైగా వ్యూస్ తో బాగా వైరల్ అయింది.డిజిట్‌ను తయారు చేసిన కంపెనీ, పరీక్ష సమయంలో 99% సమయం రోబోట్ సరిగ్గానే పనిచేసిందని చెప్పింది.డిజిట్‌ పాడైపోలేదని, బ్యాటరీ తక్కువగా ఉండడం వల్లనే ఆగిపోయిందని వారు వివరించారు.

డిజిట్ అనేది మనిషిలా కనిపించే ప్రత్యేకమైన రోబో( Robot ).ఇతర రోబోలు చేయలేని విధంగా కదలగలదు.నున్నగా, సునాయసంగా అడుగులు వేసేందుకు తయారు చేసిన కాళ్లు, వస్తువులను ఎత్తే చేతులు దీనికి ఉన్నాయి.చుట్టూ ఏమి జరుగుతోందో, ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి దాని శరీరంలో చాలా సెన్సార్లు, కంప్యూటర్లు ఉంటాయి.

అంటే, గిడ్డంలలో సామాన్లు వస్తువులను తరలించడం వంటి ఉపయోగకరమైన పనులు చేయడానికి ఇది వివిధ ప్రదేశాలకు వెళ్లగలదు.

కంపెనీ డిజిట్‌కు సంబంధించిన మరొక వీడియోను కూడా పంచుకుంది.డిజిట్ నిలకడగా ఉంటుందో లేదో చూసేందుకు ఈ వీడియో అని వారు చెప్పారు, కానీ బయట మంచి వాతావరణంలో డిజిట్ నడుస్తున్నట్లు కూడా చూపించాలనుకున్నట్లుంది.ఈ డిజిట్ ఉదంతం రోబోలను తయారు చేయడం ఇప్పటికీ కష్టమైన పని అని తెలియజేస్తుంది.

డిజిట్ వంటి రోబోట్లు గిడ్డంలలో పనులు చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు, కానీ అవి ఎప్పుడూ సమర్థంగా పనిచేసేలా చూసుకోవడం ముఖ్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube