కరోనా మహమ్మారి ఏ ముహూర్తాన అడుగుపెట్టిందో కానీ ఎవరినీ వదిలి పెట్టడం లేదు.సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ కరోనా వెంటాడుతూనే ఉంది.
అయితే తొలిసారిగా ఒక ప్రజా ప్రతినిధి కరోనా తో కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తమిళనాడు ప్రజా ప్రతినిధి అయినా డీఎంకే శాసన సభ్యుడు జే.అన్భ జగన్(61) కరోనా తో పోరాడుతూ ప్రాణాలు పోగొట్టుకున్నారు.
అయితే ఆయన పుట్టిన రోజు నాడే ఆయన ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది.ఆయన మృతితో ఆయన కుటుంబసభ్యులు,అనుచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అన్బాజగన్ ఇటీవల అనారోగ్యబారిన పడటంతో ఆస్పత్రిలో చేర్పించారు.అయితే అనారోగ్యం తో బాధపడుతున్న ఆయనకు ఆసుపత్రి సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు తేలింది.
దీనితో ఆయనకు చికిత్స కూడా అందిస్తున్నారు.అయితే ఈ క్రమంలోనే ఆయన పరిస్థితి విషమించడం తో ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.
వ్యాధి తీవ్రత అధికంగా ఉండటంతోనే ఇలా జరిగిందని వైద్యులు వెల్లడించారు.కాగా ఆయన లాక్‌డౌన్ సమయంలో చాలా చురుగ్గా పని చేస్తూ తన నిజయోజకవర్గ ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
కష్టాల్లో ఎవరు ఉన్నా వెంటనే స్పందించి సాయం అందించారు.అలాంటి వ్యక్తి మరణించడంతో ఆయన నియోజకవర్గ ప్రజలు,అభిమానులు విచారంలో మునిగిపోయారు.