రాధిక కి మరో ఛాన్స్‌.. ఈసారి అయినా లక్‌ కలిసి వచ్చేనా?

అనుకోని అవకాశం అన్నట్లుగా నేహా శెట్టి( Neha shetty )కి డీజే టిల్లు సినిమా లో ఛాన్స్ దక్కింది.అంతకు ముందు ఈ అమ్మడు మెహబూబా, గల్లీ రౌడీ సినిమాల్లో నటించింది.

 Dj Tillu Heroine Neha Shetty One More Chance With Rules Ranjann  , Dj Tillu  , K-TeluguStop.com

ఆ రెండు సినిమా లు కూడా ఫ్లాప్ అయ్యాయి.దాంతో అఖిల్‌ మూవీ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ లో చిన్న పాత్ర లో కనిపించింది.

చిన్న చితకా పాత్ర లతో కెరీర్ ని నెట్టుకు రావాల్సిందే అనుకుంటూ ఉండగా అనూహ్యంగా డీజే టిల్లు లో రాధిక పాత్ర ను దక్కించుకుంది.ఒక్కసారి గా తెలుగు ప్రేక్షకుల్లో రాధిక గా నిలిచి పోయింది.

అమ్మాయిలు ఇలాగే ఉంటారేమో అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తే.ఇంత అందంగా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Bedurulanka, Dj Tillu, Kiran Abbavaram, Neha Shetty, Radhika, Ranjann, To

మొత్తానికి డీజే టిల్లు సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు అవుతున్నా కూడా రాధిక పేరు మాత్రం మ్రోగుతూనే ఉంది.ప్రస్తుతం రాధిక కెరీర్ లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.డీజే టిల్లు సినిమా తో వచ్చిన పాపులారిటీ మరియు స్టార్‌ డమ్‌ తో వరుసగా సినిమా ల్లో ఆఫర్లు అయితే వచ్చాయి.కానీ ఈ అమ్మడికి సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు.

Telugu Bedurulanka, Dj Tillu, Kiran Abbavaram, Neha Shetty, Radhika, Ranjann, To

హీరోయిన్‌ గా ఇటీవలే ఈ అమ్మడు బెదురు లంక( Bedurulanka 2012 ) సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా లో పల్లెటూరు హాట్‌ బ్యూటీ గా కనిపించింది.ఆ సినిమా కమర్షియల్‌ గా ఆకట్టుకోలేదు.పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా నేహా శెట్టికి ఆ సినిమా పెద్దగా ఫలితాన్ని ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.ఆ సినిమా ఫలితం పక్కన పెట్టి రూల్స్ రంజన్‌ సినిమా( Rules Ranjan ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.ఈ సినిమా లోని చూశా చూశా పాటతో యూత్‌ లో మరింతగా హీట్ ని పెంచింది అనడం లో సందేహం లేదు.

ఆ పాట వల్ల రొమాంటిక్ హీరోయిన్‌ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.అందుకే ఆ పాట తెగ ట్రెండ్‌ అవుతోంది.

రూల్స్ రంజన్ ఈ వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా సక్సెస్ అయితేనే టాలీవుడ్‌ లో మరిన్ని ఆఫర్లు నేహా శెట్టికి వస్తాయి అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube