టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
విచారణ నేపథ్యంలో చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా, సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.ఈ క్రమంలోనే కేవలం రాజకీయ కారణాలతోనే సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారని లూథ్రా కోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలోనే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.







