జిడ్డు చర్మం కోసం రెండు ప్రత్యేకమైన స్కిన్ మాయిశ్చరైజర్స్

చర్మం జిడ్డుగా ఉంటే ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతాయి.చర్మానికి ఏది రాసిన నూనె,జిడ్డు రూపంలో కనపడుతూనే ఉంటుంది.

ముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉంటే ముఖం అసహ్యంగా కనపడుతుంది.ప్రతి గంటకు ముఖాన్ని శుభ్రం చేసుకున్న సరే పరిస్థితిలో మార్పు కనపడదు.

ఈ సమస్య పరిష్కారం కావాలంటే ముఖాన్ని తప్పనిసరిగా తేమగా ఉంచుకోవాలి.ముఖంలో తేమ ఎక్కువగా ఉంటే జిడ్డు సమస్య కనపడదు.

కాబట్టి ఎప్పుడు ముఖం తేమగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.కాబట్టి ముఖానికి మాయిశ్చరైజర్స్ రాస్తూ ఉంటె జిడ్డు సమస్య తొలగిపోతుంది.

Advertisement

మాయిశ్చరైజర్స్ ని ఇంటిలోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.ఇప్పుడు ఎలా తయారుచేయాలో వివరంగా తెలుస్కుందాం.

అరకప్పు పాలలో మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ ని కలపాలి.ఈ రెండు బాగా కలవాలంటే కనీసం అరగంట సమయం పడుతుంది.కాబట్టి కాస్త ఓపికగా వెయిట్ చేయాలి.

ఈ రెండు బాగా కలిసాక రాత్రి పడుకొనే ముందు గాని లేదా ఉదయం స్నానము చేసిన తర్వాత గాని ముఖానికి రాసుకోవాలి.అవసరమైతే ఈ మాయిశ్చరైజర్ లో నిమ్మరసం కూడా కలపవచ్చు.

ఒక కప్పు నీటిని మరిగించాలి.మరుగుతున్న నీటిలో గులాబీ రేకులను వేసి 45 నిమిషాల పాటు మరిగించాలి.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
ఆర్జీవీని పటాయించే క్రమంలో వంశీ నాపై కుట్రలు చేశాడు- జేడీ చక్రవర్తి

ఈ నీటిని వడకట్టి ముఖానికి రాయాలి.ఇలా చేస్తూ ఉంటే ముఖం మీద జిడ్డు తొలగిపోతుంది.

Advertisement

అవసరమైతే ఈ మిశ్రమంలో కలబంద జెల్ ని కలపవచ్చు.ఈ రెండు మాయిశ్చరైజర్స్ చర్మంలో జిడ్డు తొలగించటానికి సహాయపడతాయి.

తాజా వార్తలు