దీపావళి స్పెషల్.. ఈ రోజు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

దీపావళి పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజున ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ పండుగను కులాలు మతాలకు అతీతంగా ఒక వేడుక లాగా, విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు.

ఈ పండుగకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అంతే కాకుండా కొత్త బట్టలు, గుమగుమలాడే పిండివంటలు, టపాకాయల మోత తో ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.

Diwali Special, Deepavali Precautions, Covid-19, Green Crackers, Corona Virus, S

ఈ సంవత్సరం దీపావళిని కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, టపాకాయలు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.టపాకాయలు కాల్చేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయి.

అయితే బాణాసంచా కాల్చే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.బాణసంచాలను ఇంటిలో కాల్చకూడదు.

Advertisement

వాటిని కాల్చాలనుకున్నప్పుడు ఇంటికి దూరంగా బహిరంగ ప్రదేశాలలో కాల్చడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.అంతేకాకుండా టపాకాయలను గ్లాస్ కంటైనర్లలో పెట్టి కాల్చకూడదు.

టపాకాయలను పేల్చేటప్పుడు కొన్నిసార్లు అవి పేలకుండా ఆగిపోతాయి.అలాంటి వాటిని వెంటనే వెళ్లి పట్టుకోవడం లాంటివి చేయకూడదు.

ముందుగా వాటిపై నీటిని పోయడం వల్ల వాటి నుంచి ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు.టపాకాయలు కాల్చేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆల్కహాల్ శానిటైజర్ లను వాడి టపాకాయలను వెలిగించకూడదు.

శానిటైజర్ లకు తొందరగా మండే స్వభావం ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతాయి.అందువల్ల దీపావళి రోజు శానిటైజర్ లను వాడకపోవడం మంచిది.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?

టపాకాయలను కాల్చేటప్పుడు వాటిపై ఇచ్చిన సలహాలు సూచనలను ఖచ్చితంగా చదివి పాటించాలి.బాణాసంచాల వల్ల మంటలు అంటుకునే ప్రదేశాలు అంటే కరెంటు తీగలు, ఎండు గడ్డి, పూరి గుడిసెలు ఉన్న ప్రదేశాలలో బాణాసంచాలు కాల్చకూడదు.

Advertisement

టపాకాయలను, కాకర పువ్వులను కాల్చి వాటిని అలాగే రోడ్డు మీద పడేయడం వల్ల ఆ దారి వెంట వెళ్లే వారికి వాటి నుంచి ప్రమాదం కలగవచ్చు.అందుకోసమే ముందుగా ఒక బకెట్లో ఇసుక పెట్టుకొని అందులో కాల్చిన కాకర పువ్వులను, టపాకాయలను వేయడం మంచిది.

బాణాసంచాలను కాల్చేటప్పుడు ముందస్తు జాగ్రత్తగా ఒక బకెట్ నిండా నీటిని పక్కన ఉంచుకోవాలి.అంతేకాకుండా చిన్నపిల్లలను పెద్దవారు తమ దగ్గరే ఉంచుకుని వారిచేత జాగ్రత్తగా టపాకాయలను కాల్పించాలి.

వీలైనంతవరకు అందరూ కూడా కాటన్ దుస్తులను ధరించి ఈ పండుగను తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా గడపాలి.

తాజా వార్తలు