ఖలిస్తాన్ ఉగ్రవాది , ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Justin Trudeau ) వ్యాఖ్యల తర్వాత ఖలిస్తాన్ గ్రూపులు , మద్ధతుదారులు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ‘‘సిక్స్ ఫర్ జస్టిస్ ’’ (ఎస్ఎఫ్‌జే) తీవ్రంగా రియాక్ట్ అవుతోంది.
ఈ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ( Gurupatwant Singh Pannu ) వరుసగా భారత్‌కు హెచ్చరికలు చేస్తున్నాడు.అంతకుముందు .కొద్దిరోజుల క్రితం హిందువులంతా తక్షణం కెనడాను వదిలిపెట్టాల్సిందిగా పన్నూ సారథ్యంలోని ఎస్ఎఫ్‌జే హెచ్చరించింది.నిజ్జర్ హత్యకు గాను భారతదేశానికి మద్ధతుగా హింసను ప్రోత్సహించినందుకు కెనడాను విడిచిపెట్టాల్సిందిగా అల్టీమేటం జారీ చేసింది.
ఇక్కడున్న హిందువులు భారతదేశానికి మద్ధతు ఇవ్వడమే కాకుండా.ఖలిస్తాన్( Khalistan ) మద్ధతుదారుల ప్రసంగాలు, వ్యక్తీకరణను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్ఎఫ్‌జే ఆరోపించింది.ఎస్ఎఫ్‌జే వీడియోనే కాకుండా.కెనడాలోని( Canada ) భారత్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్తలకు బెదిరింపులు.
వారి పోస్టర్‌లు, గ్రాఫిటీలతో దేవాలయాలను ( Temples ) అపవిత్రం చేసిన ఘటనలు ఈ వేసవి నుంచి భారీగా పెరిగాయి.ఈ చర్యలు కెనడాలో హిందూ ఫోబియా సమస్య తెరపైకి రావడదానికి దారి తీశాయి.
ఈ ఘటనలను కెనడాలో విపక్ష నేత పియరీ పొయిలీవ్రే ఖండించారు.

తాజాగా ఖలిస్తాన్ మూకలు దీపావళి వేడుకలను( Diwali Celebrations ) టార్గెట్ చేశాయి.దీవాళి వేడుకల్లో పాల్గొంటున్న వారిపై రాళ్లు రువ్వారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పోలీసులు వీడియోలను తీస్తున్న వారిని, రాళ్లు విసురుతున్న వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.దీనిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.
దీపావళి వేడుకలు జరుపుకుంటున్న హిందువులపై దాడి గురించి వినడం చాలా దురదృష్టకరమమన్నారు.

కెనడియన్ మీడియా ఈ సంఘటనను సిక్కులు హిందువుల మధ్య పోరాటంగా పేర్కొనడం ఆందోళన కలిగిస్తుంది.ఈ దాడి స్పష్టంగా మతపరమైన ద్వేషంతోనే జరిగిందని నెటిజన్లు మండిపడుతున్నారు.మరోవైపు ఈ ఘటనను భారత్( India ) తీవ్రంగా స్పందించింది.
ప్రార్థనా స్థలాలపై దాడులను నిరోధించే చర్యలను పటిష్టం చేయడానికి, ద్వేషపూరిత ప్రసంగాలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వానికి సిఫారసు చేసింది.







