మునుగోడులో రసవత్తంగా రాజకీయాలు నడుస్తున్నాయి.ఎన్నికల వేళ మునుగోడు ఓటర్లు ప్రధాన రాజకీయ పార్టీలు దీపావళి బంపర్ ఆఫర్ ప్రకటించాయి.
ఈ ఆఫర్లు చూస్తుంటే తెలంగాణలోనే కాస్‌ట్లీ ఎన్నికలు మునుగోడులోనే జరగనున్నట్లు చెప్పవచ్చు.దీపావళి పండుగ సందర్భంగా మహిళలకు చీరలు, చిన్న పిల్లలకు స్వీట్లు, అలాగే టపాసుల బాక్సులను సిద్ధం చేశారు.
అలాగే మందుబాబులకు మద్యం, మాంసం సిద్ధం చేశారు.వీటిని ఇప్పటికే కొన్ని చోట్లలో పంపిణీ చేయడం కూడా ప్రారంభించారు.
మరికొన్ని ప్రాంతాల్లో పంపిణీకి సిద్ధం చేస్తున్నారు.వీరితోపాటు యువతకు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
ఆయా గ్రామాల్లోని యువతకు దీపావళి సందర్భంగా కొత్త బట్టలు పెడుతున్నారు.అయితే గతంలో పార్టీలు గ్రామాల్లోకి వెళ్లినప్పుడు గ్రామ పెద్దలతో సమావేశం అయ్యే వారు.
తమ పార్టీకి ఓటు వెయ్యాలని ఎంతో కొంత చేతికి ముట్టజెప్పి వెళ్లిపోయేవారు.కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
ఇప్పుడు ఆయా ప్రధాన పార్టీలు ఏకంగా ఇంటింటికీ వెళ్లి దీపావళి కానుకలు పంచి పెడుతున్నారు.దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే ఆయా గ్రామాల్లో ఉన్న స్ట్రాంగ్ లీడర్లను కొన్ని పార్టీలు తమ వైపు తిప్పుకున్నాయి.ఇప్పుడు ఓటర్లనే నమ్ముకుని అందరూ ప్రచారంలో బీజీగా ఉంటున్నారు.

ఎన్నికల్లో గెలిచేందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు ఆయా పార్టీల నేతలే ఒప్పుకుంటున్నారు.కాగా, చౌటుప్పల్ మండలం మల్కాపూర్‌లో 3 వేల మంది ఓటర్లు ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు 15 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంది.మల్కాపురంలోని వెయ్యి మంది ఓటర్లను యాదాద్రి నర్సింహ స్వామి దర్శనానికి బస్సులో తీసుకెళ్లారు. వీఐపీ క్యూలో దర్శనం చేపించి అదే బస్సులో తిరిగి ఊరికి తీసుకొచ్చారు.కాగా, చండూర్‌లో బీజేపీపై వ్యతిరేకత ఏర్పడింది.
రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి.దీంతో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.







