వైరల్ వీడియో: అలల మధ్య బిగ్ బాస్ బ్యూటీ!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా ఎంతోమంది కంటెస్టెంట్ లు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

ఈ తరహాలోనే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందు దివి అంటే పెద్దగా ఎవరికీ తెలియదు.

కానీ బిగ్ బాస్ ద్వారా హౌస్ లోకి ఎంటరైన దివికి ప్రస్తుతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉందనే చెప్పవచ్చు.బిగ్ బాస్ హౌస్ లో ఎంతో అద్భుతంగా ఆడుతూ, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లను ఎంతో సునాయాసంగా చేస్తూ దాదాపు 50 రోజులపాటు హౌస్ లో పాల్గొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

దసరా పండుగ రోజు బిగ్ బాస్ హౌస్ కి హోస్ట్ గా ప్రాతినిధ్యం వహించిన సమంత చేసిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి దివి ఎలిమినేట్ అయ్యారు.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దివి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉన్న దివి అందుకు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో తాజాగా దివి కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు.

Advertisement

ప్రస్తుతం అవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా సముద్రతీరంలో తెల్లని డ్రెస్ వేసుకుని ఎంతో అద్భుతంగా స్లో మోషన్ లో డాన్స్ చేస్తూ ఉన్న ఒక వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు.

ఈ వీడియోలో తన అందచందాలతో ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తూ ఉన్న దివిని చూస్తే అలలు కూడా చిన్నబోయి ఉన్నాయి.స్లో మోషన్ లో ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈమె అందం ముందు అన్ని తక్కువే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఎంతో అద్భుతంగా ఉన్న ఈ వీడియోకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం దివికి నటిగా ఆఫర్లు వస్తున్నప్పటికీ సరైన కథ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు