వైరల్: నీటి అడుగున డైవింగ్, ఇంతలో అనూహ్యపరిణామం.. ప్రాణంపోయేంత పని అయ్యింది!

ఇక్కడ అనకొండ( Anaconda ) సినిమా చుడనివారు ఎవరూ ఉండరనే చెప్పుకోవాలి.ఈ సినిమాని చూసి చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరూ భయబ్రాంతులకు గురయ్యారు.

ఆ సినిమాలో కొండచిలువ నేలపైనే కాదు, నీటిలో కూడా మనుషులతో ఆడుకుంటుంది.ఇవి భారీ సైజులో కదులుతూ ఉంటే చూసేవారికి గగుర్పాటు కలుగుతుంది.

ఇక దానికి ఆకలి వేసిందంటే దాని కంటపడిన ఏ జీవినీ వదిలి పెట్టదని చెప్పుకోవాలి.అలాంటి కొండ చిలువని మీరు ప్రత్యేక్షంగా చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సిస్సు పడుతుంది కదూ.

ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్న వీడియోని చూస్తే అదే ఫీలింగ్ కలుగుతోంది.అవును, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి గమనిస్తే.డైవింగ్ చేసిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది.

Advertisement

నీటి అడుగున అతగాడు డైవింగ్‌( Diving ) చేస్తుండగా అతనికి ఓ పెద్ద కొండచిలువ ఆహ్వానం పలికింది.దాన్ని చూడగానే మొదట అతడు చాలా టెన్షన్ పడ్డాడు.

నీటి అడుగు భాగంలోని అందమైన దృశ్యాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది.

మొదట భయపడినా అంతలోనే ధైర్యం తెచ్చుకుని ఆ భారీ కొండచిలువ దగ్గరకు వెళ్ళాడు.అతను తన చేతిలోని కెమెరాను ఆ పాము ముఖంపై దగ్గరగా పెట్టి వీడియో తీయడం విశేషం.మరి కొండచిలువకు అతని ధైర్యం నచ్చినట్టుందేమోగాని అతడిని ఏమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

త్వరలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా.. ఆ వివాదంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇదే!
చూపు లేకపోయినా 4 కిలోమీటర్లు నడిచి గ్రూప్4 జాబ్.. మానస సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

కొండచిలువ చాలా భయానకంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.అతడి టైం చాలా బాగుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు