ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేసిన జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌ షెట్టి

ఎలమంచిలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేసిన జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌ షెట్టి.

 District Collector Ravi Pattan Shetty Who Talked To The Victims And Provided Nec-TeluguStop.com

1.కొండమంచిలి వాణి

ఎలమంచిలి కుమ్మరివీధికి చెందిన కొండమంచిలి వాణి అనే బాలికకు చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో పాటు చెవులు వినపడడం లేదు.మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకున్న వాణి అమ్మమ్మ, తక్షణ సహాయానికి హామీనిచ్చిన సీఎం.

2.కలగా శివాజి

ఎస్‌ రాయవరం మండలం సైతారుపేటకు చెందిన కలగా శివాజి మోటర్‌ బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందాడు.

ఆ తర్వాత క్రమేపి ఇతర అవయవాలు పనిచేయకపోవడంతో వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు.తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని సీఎంకి విన్నవించుకున్న శివాజి కుటుంబ సభ్యులు.

తక్షణ సహాయానికి హమీనిచ్చిన సీఎం.ముఖ్యమంత్రి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌ షెట్టి సీఎం రిలీఫ్‌ పండ్‌ నుంచి రూ.లక్ష చొప్పున బాధితులు ఇద్దరికీ మంజూరు చేశారు.ఆ చెక్కులను అనకాపల్లి ఆర్డీవో ఏ.జి.చిన్నికృష్ణ స్ధానిక తహశీల్దార్‌ కార్యాలయంలో బాధితులకు అందజేశారు.సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి గారు స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube