ఉమ్మడి విశాఖ జిల్లాలోని టీడీపీ -జనసేనలో( TDP-Jana Sena ) అసంతృప్తి జ్వాల చెలరేగుతోంది.ఈ మేరకు ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతలు రాజీనామా బాట పట్టారు.
ఈ క్రమంలోనే అనకాపల్లి నియోజకవర్గ టికెట్ దక్కకపోవడంతో జనసేన నేత పరుచూరి భాస్కర్ రావు( Paruchuri Bhaskar Rao ) రాజీనామాకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది.పాడేరు టికెట్ టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి( Giddi Eshwari ) కేటాయించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని పార్టీ క్యాడర్ చెబుతోంది.
అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గ స్థానాన్ని బండారుకు కేటాయించాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు.మాడుగుల టికెట్ ను రామునాయుడుకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే రాజీనామా చేసిన గండి బాబ్జి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.అలాగే అసంతృప్తిలో ఉన్న కీలక నేత గంటా శ్రీనివాసరావు ఇవాళ లేదా రేపు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.