డిస్నీ ప్లస్‌లో డాల్బీ అట్మాస్ అనుభూతి.. యూజర్లకు థియేటర్‌లో కూర్చున్న ఎక్స్‌పీరియన్స్..!

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు వస్తోంది.

అంతేకాదు తన ఫ్లాట్‌ఫామ్‌లో వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుపరిచేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంది.

ఇందులో భాగంగా ఇప్పుడు డాల్బీ అట్మాస్ టెక్నాలజీని పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.ఈ మేరకు డాల్బీ లేబొరేటరీస్‌తో కలిసి వర్క్ చేస్తోంది.డిస్నీ+హాట్‌స్టార్‌లో డాల్బీ అట్మాస్‌ త్వరలోనే తీసుకురానున్నాం.

ఇది ప్లేబ్యాక్‌ను కూడా సైతం ఆఫర్ చేయనుందని కంపెనీ తాజాగా ప్రకటించింది.అంతేకాదు, డాల్బీ అట్మాస్‌ సౌండ్ టెక్నాలజీని టీవీలు, ఏవీఆర్‌లు, సౌండ్‌ బార్స్‌, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లు, ఐఓఎస్‌ డివైజ్‌ల్లోనూ అందించనుంది.

హెడ్‌ఫోన్స్‌, ఇయర్ ఫోన్స్ ద్వారా కూడా థియేటర్ లాంటి డాల్బీ అట్మాస్ సౌండ్‌తో వీడియోలు చూడవచ్చు.ప్రస్తుతానికి డిస్నీ+హాట్‌స్టార్‌లోని రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌ నెస్‌, నవంబర్‌ స్టోరీ, హ్యూమన్‌, గ్రహణ్‌, ది గ్రేట్‌ ఇండియన్‌ మర్డర్‌, ఆర్య, శూర్‌వీర్‌, మాసూమ్‌, ఘర్‌ వాప్సీ, ఔట్‌ ఆఫ్‌ లవ్, స్పెషల్‌ ఓపీఎస్‌ 1.5, విక్రమ్‌ వంటి కొన్ని వీడియోలు డాల్బీ విజన్‌, డాల్బీ అట్మాస్‌ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తున్నాయి.

Advertisement

వీటితో పాటు అన్ని షోలకు ఈ సౌండ్ టెక్నాలజీని ఆఫర్ చేయాలని కంపెనీ భావిస్తోంది.ఏదైనా మూవీ లేదా షో టైటిల్ పేజీలో డాల్బీ బ్యాడ్జ్ చెక్ చేయడం ద్వారా అది డాల్బీ అట్మాస్ సౌండ్ తో పని చేస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు.ఈ నిర్ణయం పట్ల యూజర్లు ఖుషి అవుతున్నారు.

త్వరగా ఈ అనుభూతిని అన్ని వీడియోలలో అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల మధ్య చాలా పోటీ నెలకొంది ఈ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించడం కంపెనీలకు చాలా కష్టంగా మారుతోంది అందుకే చాలా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.డిస్నీ+హాట్‌స్టార్‌ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు