ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ సినిమా చరిత్రలోనే భారత ప్రభుత్వం ఇచ్చే అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే.( Dadasaheb Phalke Award ) ఈ అవార్డు కోసం ఒక ఫిలిం ఫెస్టివల్ నిర్వహించి ఆ కార్యక్రమానికి నటీనటులను ఆహ్వానించి వారికి అవార్డు ఇస్తూ ఉంటారు.
ఈసారి ఈ అవార్డుల కార్యక్రమం ముంబైలో అంగరంగ వైభవంగా జరగగా ఎంతో మంది బాలీవుడ్ నుంచి ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు.ముఖ్యంగా ఈసారి అవార్డ్స్ విషయంలో జవాన్ మరియు మరియు ఆనిమల్ సినిమాలు పోటాపోటీగా అవార్డులు అందుకోవడానికి సిద్ధం అయిపోయారు.
మరి ముఖ్యంగా జవాన్( Jawan Movie ) సినిమాలోని నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడిగా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) అవార్డు అందుకున్నారు.ఇదే చిత్రంలో నటించిన నయనతార( Nayanatara ) ఉత్తమ నటిగా ఈ అవార్డును అందుకుంది.
అవార్డ్స్ ఫంక్షన్ జరిగిన తీరు, అందులో అవార్డులు ఇచ్చిన విధానం చూసిన తర్వాత చాలామందికి జాలేసింది.ఎందుకంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు, ఆ అవార్డు అందుకుంటున్న వారికి ఎటువంటి పొంతన లేదు.

ఎందుకంటే భారత ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డు కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న నటీనటులకు దక్కడం అనేది చాలా విచిత్రంగా ఉంది.మామూలుగానే ఈ మధ్యకాలంలో అవార్డులకు విలువ పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది.వాటిని అవార్డులు అనడం కన్నా సంతలో అమ్మబడే వస్తువు అనడం బెటర్.అందుకే లోపాయికారిగా ఏం జరిగాయో ఏమో తెలియదు కానీ మంచి కమర్షియల్ సినిమాలైనటువంటి ఆనిమల్, జవాన్ సినిమాలోని నటులకు అవార్డ్స్ వచ్చాయి.

ఇక సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) యానిమల్ సినిమా( Animal Movie ) కోసం ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోగా ఇదే సినిమాలో నడిచిన బాబి డియోల్ కి( Bobby Deol ) ఉత్తమ విలన్ గా అవార్డు అందుకున్నాడు.పక్కా కమర్షియల్ సినిమాలో నటించిన వీరందరికీ ఈ అవార్డ్స్ రావడం నిజంగా శోచనీయం.ఇక అవార్డ్స్ కి నిజమైన అర్హత ఉన్నవారు ఎవరంటే క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డు అందుకున్న రాణి ముఖర్జీ.( Rani Mukherjee ) మిస్సెస్ చటర్జీ VS నార్వే చిత్రంలో ఆమె నటనకు గాని ఈ అవార్డు వచ్చింది.
ఇది నిజంగా ఆమె అర్హతకు తగ్గ అవార్డు అని అనుకోవచ్చు.ఇక అలాగే సామ్ బహదూర్ చిత్రంలో నటించిన విక్కీ కౌశల్ కి( Vicky Kaushal ) ఉత్తమ నటుడుగా క్రిటిక్స్ ద్వారా ఈ అవార్డు లభించింది.

ఇది కూడా మంచి అర్హత ఉన్న అవార్డు.ఇలాంటివి పరవాలేదు కానీ నయనతార, షారుఖ్ లాంటి వారు ఈ అవార్డు ఆదుకోవడం నిజంగా శోచనీయం.అసలు కమర్షియల్ సినిమా అంటేనే షారుక్ ఖాన్ కి కొట్టిన పిండి లాంటిది.ఈ మాత్రం దానికి ఇంత ప్రతిష్త్రాత్మక అవార్డు ఇవ్వడం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు.
ఇక దాదాసాహెబ్ ఫాల్కే తరపున తనకంటూ ఒక ఫౌండేషన్ కూడా ఉంది.ఈ ఫౌండేషన్ ద్వారా 2017 లో డేరా బాబా అనే దొంగ స్వామికి అవార్డు ఇచ్చారు.