హైదరాబాద్ లో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది.సికింద్రాబాద్ తిరుమలగిరిలో ముగ్గురు అమ్మాయిలు కనిపించకుండా పోయారు.
పుట్టినరోజు వేడుకలకు బయటకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి రాలేదు.దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ క్రమంలో వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.