ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి.నియోజకవర్గంలో టీడీపీ నేతలు పోటాపోటీగా సంక్రాంతి సంబురాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నాని, మాజీమంత్రి దేవినేని ఉమాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.సంక్రాంతి సంబురాల నేపథ్యంలో కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీమంత్రి దేవినేని ఉమాపై పరోక్ష విమర్శలు గుప్పించారు.మైలవరం నాది.
పశ్చిమ నియోజకవర్గం నాదంటూ వ్యాఖ్యనించడం సరికాదన్నారు.ఇది జమీందారీ వ్యవస్థ కాదన్న కేశినేని… ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
గెలిచే వారిని ముందు నిలిపి జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు.







