మామూలుగా సినిమాలలో కలిసి నటించిన హీరో హీరోయిన్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం అన్నది కామన్.కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా సినిమాలలో నటించిన నటీనటులు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటూ ఉంటారు.
అలా ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అదేవిధంగా హీరోయిన్లతో సినిమా తీసి వాళ్లనే పెళ్లి చేసుకున్న దర్శకులు కూడా చాలామంది ఉన్నారు.
ఇంతకీ ఆ దర్శకులు ఎవరు?ఆ హీరోయిన్లు ఎవరు? అన్న విషయానికి వస్తే.టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ( Krishna Vamshi ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా చంద్రలేఖ.

ఈ సినిమాలో రమ్యకృష్ణ( Ramya Krishna ) హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా సమయంలో ప్రేమలో పడిన కృష్ణవంశీ రమ్యకృష్ణలు ఆ తర్వాత 2003లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.అలాగే హీరోయిన్ అమలాపాల్( Amalapaul ) నాన్న సినిమా సమయంలో డైరెక్టర్ విజయ్ ను( Director Vijay ) ప్రేమించింది.

ఇక ఈ సినిమాతో ప్రేమలో పడిన విజయ్ అమలాపాల్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ కొంతకాలానికి విడాకులు తీసుకుని విడిపోయారు.అలాగే డైరెక్టర్ విగ్నేష్ శివన్( Vignesh Shivan ) తన సెకండ్ సినిమాను హీరోయిన్ నయనతారతో( Nayanthara ) తీయగా ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట పెళ్లి చేసుకుని ఒక్కటి అయ్యారు.ఈ జంటకు కవల పిల్లలు కూడా జన్మించారు.అలాగే సెవెన్ జి బృందావనం కాలనీ డైరెక్టర్ సెల్వ రాఘవన్( Selva Raghavan ) ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ ను( Sonia Agarwal ) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.కేవలం వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలామంది డైరెక్టర్లు హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొందరు ఇప్పటికీ కలిసి ఉండగా మరికొందరు విడాకులు తీసుకొని విడిపోయారు.