Director Puri Jagannadh : టాలీవుడ్ నార్మల్ హీరోలను మాస్ హీరోలుగా నిలబెట్టిన ఏకైక దర్శకుడు ఇతడే !

చాలామంది హీరోలు అవుతారు . మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసి అలాంటి సినిమాలు తీసినప్పుడే అతడు నిజమైన హీరో అవుతాడు.

 Director Who Made Normal Heros To Mass Heros-TeluguStop.com

కానీ హీరోలు మామూలుగా నటించడం మాత్రమే చేస్తారు.ఆ హీరోకి సరిపడా ఒక పాత్ర వస్తే తప్ప అతడు మాస్ హీరో అవ్వలేడు.

మరి ఒక మనిషి తనకు సరైన పాత్ర దొరుకుతుందా లేదా అనేది నిర్ధారించేది దర్శకుడు మాత్రమే.దర్శకుడికే తన హీరో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది పూర్తిగా తెలిసి ఉంటుంది.

అందుకే టాలీవుడ్ లో చాలామంది హీరోలు పూరి జగన్నాథ్( Puri Jagannadh ) లాంటి ఒక దర్శకుడు చేతిలో పడితే రాయి లాంటి వారు కూడా రత్నంగా మారిపోతారు అని అంటూ ఉంటారు.ఇది చెప్పింది ఎవరో కాదు ఏకంగా రాజమౌళి ఈ విషయాన్ని ఒప్పుకుంటాడు.

పూరి జగన్నాథ్ ఒక మహానుభావుడు అని, ఏ హీరోనైనా కూడా మాస్ హీరోగా మలిచే దమ్మున్న ఏకై దర్శకుడు అంటూ రాజమౌళి పూరి జగన్నాథ్ కి పొగుడుతూ ఉంటాడు.

Telugu Bujjigadu, Mahesh Babu, Mass Heroes, Mass, Pawan Kalyan, Prabhas, Puri Ja

ఇంతకీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సాధారణ హీరోలు ఎప్పుడు మాస్ హీరోలు( Mass Heroes ) అయ్యారు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.ఉదాహరణకు ప్రభాస్ ని తీసుకుంటే బుజ్జిగాడు సినిమా( Bujjigadu ) చేయడానికి ముందు ప్రభాస్( Prabhas ) కేవలం ఒక నటుడు, ఒక హీరో మంచి సినిమాలు తీస్తున్నాడు అనే పేరు ఉండేది.కానీ ఎప్పుడైతే బుజ్జిగాడు సినిమా తీశాడో అప్పుడే మాస్ లో అతడికి ఒక రేంజ్ వచ్చింది.

మాస్ హీరోగా ప్రభాస్ మారిపోయాడు.ఇక పవన్ కళ్యాణ్ సైతం పూరి జగన్నాథ్ వల్లే మాస్ హీరోగా నిలబడ్డాడు.

వీరిద్దరి కాంబినేషన్లో బద్రి అనే సినిమా వచ్చింది.అప్పటి వరకు పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, సుస్వాగతం వంటి క్లాస్ లవ్ స్టోరీస్ మాత్రమే చేస్తున్నాడు.

Telugu Bujjigadu, Mahesh Babu, Mass Heroes, Mass, Pawan Kalyan, Prabhas, Puri Ja

కానీ బద్రి సినిమా( Badri Movie )తో అతనిలోని మాస్ యాంగిల్ ప్రేక్షకులకు నచ్చి అందరూ అభిమానించే హీరోగా మారిపోయాడు.రవితేజ విషయం ఎంత చెప్పినా తక్కువే.ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి సినిమాలతో ఒక రేంజ్ హీరోగా పూరి జగన్నాథ్ వల్లే మారిపోయాడు.మహేష్ బాబు( Mahesh Babu ) కూడా పోకిరి సినిమా తర్వాతే బీ, సీ సెంటర్లో కూడా కలెక్షన్స్ దక్కించుకునే ఒక మాస్ హీరోగా నిలబడ్డాడు.

అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ పోకిరి సినిమాకు ఉన్న రేంజ్ మరో రేంజ్ కి వెళ్ళిపోయింది.బిజినెస్ మ్యాన్ కూడా ఆ తరహా చిత్రమే.తారక్ సైతం ఆంధ్ర వాలా సినిమాతోనే మాస్ హీరోగా నిలబడ్డాడు.ఇక టెంపర్ సినిమా గురించి కూడా తెలిసిందేగా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube